- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అవయవదానంతో మరొకరికి పునర్జన్మ
రుద్రారంలో కుటుంబసభ్యుల ఔదార్యం
దిశ, రామడుగు: పుట్టెడు దుఃఖంలో ఉన్నా.. ఔదార్యంతో అవయవ దానం చేసి ఓ కుటుంబ సభ్యులు మానవత్వన్ని చాటుకున్న ఘటన రామడుగు మండలంలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని రుద్రారం గ్రామానికి చెందిన వేముల హరీష్ (35) చొప్పదండి ఎస్.బీ.ఐ బ్యాంకులో క్యాషియర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం విధులు ముగించుకుని చొప్పదండి నుండి రుద్రారంకు వస్తున్న క్రమంలో చొప్పదండి సమీపంలో గేదలు అడ్డురావడంతో బైకు అదుపు తప్పి హరీష్ కింద పడిపోయాడు.
ఈ క్రమంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతని కుటుంబ సభ్యులు అతడిని కరీంనగర్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లి అక్కడ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మైరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో హరీష్ చికిత్స పొదుతూ బ్రెయిన్ డెడ్ తో మంగళవారం ఉదయం మృతి చెందాడు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులు అవయవాలను ఔదార్యంతో దానం చేశారు. మృతుడికి భార్య సౌజన్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. హరీష్ మృతితో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.