- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అమాయక ప్రజలను మోసం చేస్తున్న రియల్టర్లు..
దిశ, శంకరపట్నం : అమాయక ప్రజలను మోసం చేస్తూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భూములు విక్రయిస్తూ రియల్టర్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. లక్షలుపెట్టి శంకరపట్నం మండలంలోని వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి గజాల్లో అమ్ముకుంటూ కోట్లు గడిస్తున్నారు. నూతన పంచాయత్ చట్టం ప్రకారం వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చిన తర్వాత రిజిస్ట్రేషన్ మార్పిడి చేయాల్సి ఉంది. నిబంధనలకు విరుద్ధంగా కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో భూములకు రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, దళిత, ప్రజా, సంఘాల నాయకులు ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో శంకరపట్నంలో రాష్ట్రరాజధాని హైదరాబాద్ కంటే అధిక రేట్లకు పెరుగుతున్నాయి. రియల్ మాఫియా ఆగడాలకు శంకరపట్నం మండలంలో అడ్డుఅదుపు లేకుండా పోతుందని, మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శంకరపట్నం మండలంలోని కేశవపట్నంలో సర్వేనంబర్ 506లో 5:26, 509 లో 5:29 వ్యవసాయ భూమిని ఎకరాల్లో కొన్నిగజాల్లో విక్రయించారు. 243లో 9 ఎకరాల వ్యవసాయ భూమిని ఎకరాల్లో కొని గజాల్లో రియల్ మాఫియా విక్రయించారు. ఎలాంటి నిర్మాణం అనువతలు లేవని, కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల అదనపుకలెక్టర్ గరీమ అగర్వాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, ఏర్పాటుచేసిన ప్రహరీ గోడను కూల్చి కూల్చివేసి ఈ భూమికి ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవని బోర్డు పెట్టించిన, రియల్ ఎస్టేట్ మాఫియా బ్రోకర్లు అన్ని అనుమతులు ఉన్నాయని మధ్య బ్రోకర్లు రియల్ ఎస్టేట్ మాఫియా అమాయక ప్రజలను మోసం చేసి 9 ఎకరాల భూమిని గజాల్లో అమాయక ప్రజలకు విక్రయించారు. రియల్ ఎస్టేట్ మాఫియా కోట్ల రూపాయలను దండుకున్నట్లు మండలంలో చర్చ జరుగుతోంది.
మొలంగూర్ లో సర్వేనంబర్ 707/బి /ఎ, 707/డీ/ఎ లో 4 ఎకరాల వ్యవసాయ భూమిని రియల్ ఎస్టేట్ మాఫియా యూఎస్ఏలో ఉంటున్న పట్టాదారు నుండి ఆన్లైన్ లో కొనుగోలు చేసి, ఎకరాల్లో కొనుగోలు చేసిన వ్యవసాయ భూమిని గజాల్లో అమ్మేందుకు చదును చేస్తున్నారు. వంకాయ గూడెం శివారులో సర్వేనెంబర్ 258లో 5:33, 259లో 1:03, 157లో 1:16 వ్యవసాయ భూమిలో రియల్ ఎస్టేట్ మాఫియా గజాల్లో విక్రయించి అన్ని అనుమతులు ఉన్నాయన్నడంతో గ్రామపంచాయతీ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశంతో ఎలాంటి అనుమతులు లేవని బోర్డులను పెట్టిన, బ్రోకర్లను పెట్టుకొని, రియల్ మాఫియా అన్ని అనుమతులు ఉన్నాయంటూ మాయమాటలు చెప్పి అమాయక ప్రజలను మోసం చేస్తూ గజాల లెక్కన, గజంకు 10 నుంచి 15 వేల రూపాయల వరకు రియల్ ఎస్టేట్ మాఫియా విక్రయిస్తూ, బ్రోకర్లను పెంచి పోషిస్తున్నారు.
దీంతో సామాన్య ప్రజానీకం ఉండడానికి ఇల్లు కట్టుకోవాలంటే శంకరపట్నం మండలంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పట్టణంలో లేని భూముల రేట్లు శంకరపట్నం మండలంలో బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ మాఫియా రేట్లు పెంచుతున్నారు. ఆకాశానికి రేట్లు అంటడంతో సామాన్య కుటుంబాలకు సొంతగృహం నిర్మాణం కలగానే మిగిలిపోతుందని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నియమనిబంధనలను ఉల్లంఘించి, అమాయక ప్రజలను మోసం చేస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నా రియల్ మాఫియా పై, మధ్య బ్రోకర్ల పై దళారుల పై చట్టపరంగా న్యాయపరంగా చర్యలు తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా భూములు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
డీటీసీపీఓ అనుమతులు తప్పనిసరి.. ఎంపీడీవో ఎండీ ఖాజా బషీరోద్దీన్..
నూతన పంచాయత్ చట్టం ప్రకారం గృహ నిర్మాణం చేయాలంటే డీటీసీపీఓ ఆన్లైన్ దరఖాస్తు చేసుకొని, డీటీసీపీఓ అనుమతి పొందిన తర్వాత గృహం నిర్మాణం మొదలు పెట్టాలి. మండలంలో వ్యవసాయ భూముల్లో గజాల లెక్కన కొనుగోలు చేసిన భూములకు ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేవు, ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పంచాయతీరాజ్ చట్టానికి వ్యతిరేకంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏర్పాటు చేసిన ప్రహరీ గోడలు, కంచెలను కూడ తొలగించి, భూములను కొనుగోలు చేయవద్దు అనుమతులు లేవని అధికారులు ఆదేశం మేరకు బోర్డులు కూడా పాటించినట్లు ఎంపీడీవో కాజా బషీరోద్దీన్ వివరణ ఇచ్చారు.
దృష్టికి వస్తే చట్టపరంగా చర్యలు తప్పవు.. తహసీల్దార్ శ్రీనివాసరావు..
నూతన రెవెన్యూ చట్టం ప్రకారం ప్రభుత్వానికి రుసుము చెల్లించి, వ్యవసాయ భూములను, కమర్షియల్ భూములుగా మార్పిడి చేసిన తర్వాత విక్రయించాల్సి ఉంది. ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని తహసిల్దార్ గూడూరి శ్రీనివాసరావు వివరణ ఇచ్చారు.