Vemulawada : తమ బదిలీలను ఆపండి..ప్రభుత్వ విప్‌లను కోరిన రాజన్న ఆలయ ఉద్యోగులు

by Aamani |   ( Updated:2024-07-23 11:33:49.0  )
Vemulawada : తమ బదిలీలను ఆపండి..ప్రభుత్వ విప్‌లను కోరిన రాజన్న ఆలయ ఉద్యోగులు
X

దిశ,వేములవాడ : రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖల్లో ఉద్యోగుల బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నాయి.ఈ తరుణంలో తమ బదిలీలను ఆపాలని కోరుతూ మంగళవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం ఉద్యోగులు అసెంబ్లీ ప్రాంగణంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్ , బీర్ల ఐలయ్యలను కలిసి విన్నవించుకున్నారు. ఆలయ ఉద్యోగుల సంఘం గౌరవ అధ్యక్షుడు సిరిగిరి శ్రీ రాములు ఆధ్వర్యంలో విప్ లను కలిసిన ఉద్యోగులు తమను బదిలీ చేయవద్దని, బదిలీల విషయంలో పునరాలోచించాలని కోరారు. ఆయన వెంట పర్యవేక్షకులు నటరాజు, నాగుల మహేష్, గుండి నరసింహ మూర్తి ,సీనియర్ అసిస్టెంట్ ఎడ్ల శివ,సురేష్,గడ్డం రాజేందర్,నక్క తిరుపతి తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story