- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
18న జగిత్యాలకు రాహుల్ గాంధీ, ప్రియాంక
దిశ, మల్యాల/జగిత్యాల టౌన్: ఈనెల 18న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు ఒక ప్రకటనలో తెలియజేశారు. 18న జిల్లాలోని మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇక్కడ నుండే ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర ప్రారంభించనున్నట్లు సమాచారం. అనంతరం మల్యాల మీదుగా జగిత్యాలకు చేరుకొని పట్టణంలోని న్యూ బస్టాండ్ చౌరస్తా వద్ద రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షో లో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని కాంగ్రెస్ శ్రేణులు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత మొట్టమొదటిగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలు జగిత్యాలలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఏర్పాట్లు పరిశీలించిన ఏఐసీసీ సెక్రటరీ సుశాంక్ మిశ్రా..
రాహుల్ గాంధీ జిల్లా పర్యటన నేపథ్యంలో రోడ్ షో ఏర్పాట్లను ఏఐసీసీ సెక్రటరీ సుశాంక్ మిశ్రా, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మొట్టమొదట జగిత్యాల నుండి రాహుల్ గాంధీ ప్రారంభిస్తున్నారని తెలిపారు. గడిచిన 9 ఏండ్ల కాలం లో నెరవేర్చవలసిన హామీల పై ప్రజల ఉద్దేశించి ను రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని, అలాగే జిల్లాలోని అన్ని సీట్లను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.