సంఘటన జరిగిన వెంటనే స్థలానికి చేరుకునేలా QRT టీమ్..

by Sumithra |
సంఘటన జరిగిన వెంటనే స్థలానికి చేరుకునేలా QRT టీమ్..
X

దిశ, గోదావరిఖని : సంఘటన జరిగిన వెంటనే శాంతి భద్రతల సంరక్షణకు, అత్యవసర పరిస్థితులలో అనుగుణంగా QRT, స్పెషల్ టీములను ఏర్పాటు చేశామని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలిపారు. శనివారం రామగుండం కమిషనరేట్ లో పరేడ్ కార్యక్రమానికి హాజరై సీపీ మాట్లాడారు. కమిషనరేట్ పరిధికి ఎంపిక కాబడిన నూతన ఆర్ముడు కానిస్టేబుల్స్ లకు కమిషనరేట్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. సిబ్బంది స్కాడ్ డ్రిల్, పరేడ్, మాబ్ ఆపరేషన్ డ్రిల్, స్పెషల్ పార్టీ విధులు, కుంబింగ్ వివిధ బందోబస్త్ లలో రోప్ పార్టీ విధులు వారు చేయవలసిన విధులను తెలిపారు.

అత్యవసర పరిస్థితులలో పోలీస్ యంత్రాంగం తీసుకోవాల్సిన చర్యలను గురించి పలు సూచనలు సిబ్బందికి వివరంగా తెలిపారు. ప్రజలకు పోలీసులు నిరంతరం అందుబాటులో ఉంటూ చట్ట పరిధిలో ప్రజల సమస్యలను పరిష్కారం చేస్తూ ప్రజల భద్రత ప్రధాన లక్ష్యంగా విధులు నిర్వహిస్తారని అన్నారు. బలగాలను విస్తృతంగా వినియోగించి లా & ఆర్డర్ నిర్వహించడంలో ఏదైనా నిరసనలకు వెంటనే స్పందించడంలో వివరించారు. కీలక సమయంలో పౌరుల భద్రతను నిర్ధారించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని తెలిపారు. కమిషనరేట్ లో ఏదైనా అత్యవసర పరిస్థితి, చట్టవిరుద్ధ కార్యకలాపాలు సంభవిస్తే వెంటనే స్పందించేందుకు QRT బృందాలు వ్యూహాత్మకంగా నివారించడానికి విధులు నిర్వహిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, ఏఆర్ ఏసీపీ సుందర్ రావు, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాస్, సంపత్, ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed