- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
pythons : చీకటైతే చాలు రోడ్డెక్కుతున్న కొండచిలువలు..
దిశ, మానకొండూరు : మానకొండూరు నియోజకవర్గంలోని పలు మండల కేంద్రంలో కొండచిలువలతో ప్రజలు, ప్రయాణికులు వణికిపోతున్నారు. ఒక్కటి కాదు, రెండు కాదు ఎటు చూసిన అవే కనిపిస్తున్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కాచాపూర్ గ్రామంలో ఇటీవల నివసించే ఇండ్లలోకి కొండచిలువ చొరబడి పిల్లిని మింగిన సంఘటన తెలిసిందే. మానకొండూరు మండల కేంద్రంలో ఇటీవల చెరువు కట్ట సమీపంలో రోడ్డు పక్కన భారీ కొండచిలువ దారి వెంట పొంచి ఉండటం ప్రయాణికుల కంట పడింది. కొద్ది రోజుల క్రితం పోచంపల్లి మోడల్ స్కూల్ దగ్గర కాకతీయ కెనాల్ బ్రిడ్జి పై రాత్రి వేళలో రోడ్డు దాటుతుండగా ప్రయాణికుల మరో కొండచిలువ కంట పడిన సంగతి మరువక ముందే మంగళవారం అర్ధరాత్రి పచ్చునూరు గ్రామంలో అర్ద రాత్రి రోడ్డు దాటుతుండగా మరోకటి ప్రయాణికులకు దర్శనమిచ్చింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకోవాలని కోరుతున్నారు.