"విషవాయువులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి"

by Mahesh |
విషవాయువులపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
X

దిశ, కరీంనగర్ టౌన్: రసాయనిక పరిశ్రమల నుండి వెలువడే విషవాయువుల బారిన పడకుండా తీసుకునే సంరక్షణ చర్యలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. బుదవారం కలెక్టరెట్ సమావేశ మందిరంలో ప్రకృతి వైపరిత్యాలు, రసాయనిక విషవాయువులపై ఎన్‌డిఆర్ఎఫ్, వైద్యాదికారులు, అటవి, అగ్నిమాపక, పరిశ్రమల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. తిమ్మాపూర్ మండలం పర్లపలి, చెంజర్లలోని రసాయన పరిశ్రమల నుండి వెలువడే విషవాయుల బారిన పడకుండా ఉండడంపై ఈనెల 3, 4 తేదీలలో మాక్ డ్రైవ్ ఎక్సైజ్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

ప్రకృతి వైపరిత్యాలు సంబవించినట్లయితే ముఖ్యంగా కెమికల్ ఇండస్ట్రీస్‌లో వైపరిత్యాలపై గ్రామ సర్పంచులతో పాటు ఆయా మండల తహాసీల్దార్లు, ఎఎన్ఎంలు, ఆశావర్కర్లు ప్రజల్లో అవగాహన కల్పించి, రక్షణ చర్యలను తీసుకోవాలని పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డా.జువేరియా, డీపీఓ వీరబుచ్చయ్య, పశువైద్యాదికారి నరేందర్, ఎన్‌డిఆర్ఎఫ్ ఇండస్ట్రీ సిబ్బంది పాల్గోన్నారు.

Advertisement

Next Story

Most Viewed