- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాజన్నను యాది మరిచావా కేసీఆర్..?
దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామి దేవాలయం ముందు ధర్నా నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వేములవాడ దర్శనానికి వచ్చి ప్రతి సంవత్సరం రూ. 100 కోట్లు ఇస్తానని చెప్పి మాట తప్పిన ఘనత కేసీఆర్ ది అని అన్నారు. 32 ఎకరాలు చెరువు కుడిపేసి అభివృద్ధి చేస్తానని, స్వామివారి పుష్కరిణిని, కళ్యాణ ఘట్టాన్ని, క్యూలైన్స్ ను పెద్దగా చేస్తా అని, శివ కళ్యాణం రామ కళ్యాణం వేదికలు ఏర్పాటు చేస్తానని, నాంపల్లి గుట్టపై ఘాట్ రోడ్ ఏర్పాటు చేస్తానని మాటిచ్చి తప్పాడని, దీనికి పూర్తి బాధ్యత స్థానిక ఎమ్మెల్యేనే అని అన్నారు. స్థానికంగా ఉండకపోవడం పనుల మీద పట్టు లేకపోవడం దీనికి నిదర్శనమని అన్నారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు పాత సత్యలక్ష్మి, చంద్రగిరి, శ్రీనివాస్, భీమ్ రాజు, కనకరాజ్, దాడి మల్లేశం, గడ్డం రేణుక, వస్తాద్, అంజయ్య, మర్రిపల్లి రాజు, వనపర్తి శంకర్, నాగుల రాము, మెండరాజు తదితరులు పాల్గొన్నారు.