పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి : రామగుండం సీపీ

by Aamani |
పోలీస్ అమరవీరులను స్ఫూర్తిగా తీసుకోవాలి : రామగుండం సీపీ
X

దిశ,గోదావరిఖని : పోలీస్ అమరవీరులను ప్రతి ఒక్కరు స్ఫూర్తిగా తీసుకోవాలని రామగుండం కమిషనర్ ఏం.శ్రీనివాస్ అన్నారు. రామగుండం కమిషనరేట్ ఆవరణలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ కార్యక్రమ సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిలుగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ (ఐజీ) ,మంచిర్యాల కలెక్టర్ దీపక్, పెద్దపల్లి డీసీపీ చేతన పాల్గొన్నారు. వివిధ సంఘటనలో ఉగ్రవాదులచే, అసాంఘిక శక్తులచే పోరాడి అసువులు బాసిన అమరవీరులను స్మరించుకుంటూ వారి జ్ఞాపకార్థం వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసులు లేని సమాజాన్ని ఊహించలేం అని వ్యవస్థ సాఫీగా నడవడంలో పోలీసులది కీలకపాత్ర అని అన్నారు.పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని,ప్రజల, దేశ రక్షణలో ప్రాణం కంటే విధి నిర్వహణ గొప్పదని చాటిన అమరుల త్యాగాలు చిరస్మరణీయమని అన్నారు. వారి త్యాగాలను స్మరించుకునేందుకే పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నామని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో అమరులైన పోలీసుల స్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన సేవలందిస్తామని, పది రోజుల పాటు పోలీసుల ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు చేపడుతాం అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏసీపీ ఏఆర్ ప్రతాప్, సుందర్ రావు, సీఐ లు, ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వడ్ ఇన్స్పెక్టర్స్, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ సంఘం అద్యక్షులు బోర్లకుంట పోచ లింగం , ఎఒ అశోక్ కుమార్, ఏఆర్ , సివిల్, వివిధ వింగ్స్, సీపీఓ సిబ్బంది మరియు అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed