- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Peddapalli MLA : కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి...
దిశ, సుల్తానాబాద్: రైతుల సంక్షేమం పాటుపడేది, రైతు పక్షపాతిగా నిలబడింది కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అని (Peddapally MLA) పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. సుల్తానాబాద్ మండలం దేవునిపల్లి, కొదురుపాక, నారాయణపూర్, చిన్న బొంకూర్, మియాపూర్, పెరక పల్లి గ్రామాల్లో బుధవారం సింగిల్ విండో, ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రైతుల కోసం మొసలి కన్నీరు కారుస్తూ ఇటీవల కాలంలో బీఆర్ఎస్ లీడర్లు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులకు సంపూర్ణంగా రుణమాఫీ చేయకుండా వారిని వడ్డీల పాలు చేసింది గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం కాదా అని ఆయన ప్రశ్నించారు. సన్నవడ్లు వేసుకోమని చెప్పి రైతులను దివాలా తీయించింది బీఆర్ఎస్ కాదా అని విమర్శించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేయడం జరిగిందని వివరించారు. అలాగే, సన్న వడ్లకు క్వింటాలుకు రూ.5 వందల చొప్పున బోనస్ చెల్లించడం జరుగుతుందన్నారు.
ఎన్ని క్వింటాళ్ల సన్న వడ్లు అమ్మితే రైతులకు పరిమితి లేకుండా క్వింటాల్ కు రూ. 500 చొప్పున బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో కూడా రైతులను బీఆర్ఎస్ (BRS) నేతలు అయోమయానికి గురి చేస్తున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. రైతులు ఎలాంటి అపోహలకు గురికావద్దని ఆయన కోరారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా రైతుల సంక్షేమానికి పాటుపడేది ఎవరు అనేది రైతులను కలిసి అడిగితే చెప్తారని అన్నారు. వచ్చే యాసంగి పంట నుంచి రైతులకు రైతు భరోసా చెల్లించడం జరుగుతుందన్నారు. గతంలో మాదిరిగా జిల్లా యూనిట్ కాకుండా మండలాన్ని యూనిట్ గా తీసుకొని పంటల భీమా పకడ్బందీగా అమలు చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, సింగిల్ విండో చైర్మన్ మోహన్ రావు, సింగిల్ విండో చైర్మన్ సిరిగిరి శ్రీనివాస్,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్,మండల అధ్యక్షుడు చిలుక సతీష్, అబ్బయ్య గౌడ్, మండల రమేష్, ఎనగండుల ప్రదీప్, గిరేనేని సంపత్ రావు, అంజన్ రావు, కొండల్ రావు, మాధవ రావు, మోహన్ రెడ్డి, పన్నాళ రాములు, మేకల పొంచలు, శ్యాం సుందర్ రెడ్డి, చెవుల తిరుపతి, ఆర్నాకొండ సాగర్, కరుణాకర్, నగేష్,తదితరులు పాల్గొన్నారు.