- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెద్దపల్లి బీఆర్ఎస్ లో ముసలం
పార్టీ పట్టణాధ్యక్షుడి పదవికి రాజ్ కుమార్ రాజీనామా
దిశ, పెద్దపల్లి : పెద్దపల్లి పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీలో అగ్గి రాజుకుంది. బీఆర్ఎస్ పెద్దపల్లి పట్టణాధ్యక్షుడి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఉప్పు రాజ్ కుమార్ మంగళవారం సాయంత్రం రాజీనామా చేశారు. పార్టీ పుట్టిన నాటి నుంచి క్రియాశీల కార్యకర్తగా అనేక కార్యక్రమాలు తన భజస్కందాలపై వేసుకుని కార్యక్రమాలు నిర్వహించిన నాయకుడు ఒక్కసారిగా రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ లో పతనం ప్రారంభమైందంటూ పట్టణంలో కొత్త చర్చ మొదలైంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందా అనే విషయంలో రాజీనామా చేసినట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.
మొన్న మాజీ మున్సిపల్ చైర్మన్ రాజయ్య, నేడు ఉప్పు రాజ్ కుమార్ తిరుగుబావుటా ఎగరవేయడంతో బీఆర్ఎస్ లో ఒక్కసారిగా అలజడి రేగింది. రాజీనామా పత్రం నేరుగా ప్రెస్ రిలీజ్ చేయనప్పటికీ తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకోవడంతో కార్యకర్తలు, తోటి నాయకులు అవాక్కయ్యారు. నిన్నే ప్రెస్ మీట్ లో ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించం అన్న వ్యక్తి.. నేడు రాజీనామా చేయడంతో పెద్దపల్లిలో రాజకీయం రసవత్తరంగా మారింది.