దిశ ఎఫెక్ట్.. హోటళ్లలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు సీజ్..

by Sumithra |   ( Updated:2024-10-08 07:54:08.0  )
దిశ ఎఫెక్ట్.. హోటళ్లలో సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు సీజ్..
X

దిశ, హుజూరాబాద్ రూరల్ : హుజూరాబాద్ పట్టణంలో అక్రమంగా డొమెస్టిక్ సిలిండర్లను వాడుతున్న హోటల్‌ పై రెవెన్యూ, సివిల్ సప్లై ఆధికారులు సోమవారం దాడులు చేశారు. "సబ్సిడీ గ్యాస్ పక్కదారి" అనే శీర్షికన దిశ పత్రికలో గత శనివారం ఓ వార్తా కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన సివిల్ సప్లై, రెవెన్యూ అధికారులు పలు హోటళ్ల పై దాడులు చేసి 34 వరకు వంట గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కుబేర హోటల్లో ఒకటి, నిర్వహణ రెస్టారెంట్లో 8, నటరాజ్ ఉడిపిలో నాలుగు, స్వీట్ షాప్‌లో ఒక్కటి, కరాచి బేకరీలో రెండు, లక్ష్మీ బేకరీలో ఒకటి, గాయత్రి హోటల్ 4, ఇలా 14 హోటళ్లలో దాడులు నిర్వహించి సిలిండర్లు సీజ్ చేశారు.

ఈ సందర్భంగా సివిల్ సప్లై అధికారులు మాట్లాడుతూ పలు హోటలలో బేకరీలో దాడులు చేసి కమర్షియల్ బదులుగా డొమెస్టిక్ సిలిండలను వాడుతున్న వాటిని సీజ్ చేసినట్లు తెలిపారు. సీజ్ చేసిన సిలిండర్లను జాయింట్ కలెక్టర్ కు సిక్స్ ఏ కేసు ప్రతిపాదనలకు పంపించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో తహశీల్దార్ కనకయ్య, సివిల్ సప్లై డీటీఎస్ లు వసంతరావు, వినోద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శేఖర్, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed