- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువకి గండి.. పట్టించుకొని అధికారులు
by samatah |
X
దిశ, సారంగపూర్ : సారంగపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామ శివారులో ఉన్న ఎస్ ఆర్ ఎస్పీ కాలువకు గండిపడినా అధికారులు కనీసం కన్నెత్తి చూడటం లేదని పరిసర గ్రామ ప్రజలు తెలియజేశారు. గత వర్షకాలంలో పడిన అధిక వర్షాలకు కాలువకి గండి పడిoది. దాన్ని 5 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు పట్టించుకోవడం లేదని అటవి ప్రాంతం దగ్గరలో ఉండడంతో మేత మేయడానికి అటువైపు వెళ్లిన పశువులు అందులో పడటం తరచూ జరుగుతుందని సమీప ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కాలవ సరిహద్దు గ్రామాలైన హబ్సిపూర్, లక్ష్మీదేవిపల్లి, అర్పపల్లి గ్రామ రైతులు పంట పొలానికి వెళ్లే మార్గం లోనే గండి పడటంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని అధికారులు ఇకనైనా మొద్దు నిద్ర మాని మరమ్మాతులు చేయాలని కోరారు.
Advertisement
Next Story