విద్యార్థుల పాలిట మృత్యు శకటాలు.. ఫిట్నెస్ లేని బడి బస్సులు..

by Sumithra |
విద్యార్థుల పాలిట మృత్యు శకటాలు.. ఫిట్నెస్ లేని బడి బస్సులు..
X

దిశ, తిమ్మాపూర్ : బడి బస్సులకు అత్యంత ముఖ్యమైనది ఆర్టీఏ అధికారులు ఇచ్చే ఫిట్నెస్ సర్టిఫికెట్. కాగా కొన్ని పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించేందుకు ఆసక్తి చూపించకపోవడంతో ఫిట్నెస్ లేని బస్సులు విద్యార్థుల పాలిట మృత్యుశకటాలుగా మారే పరిస్థితి కన్పిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు ముమ్మరంగా కొనసాగుతుండగా ఇంకా సగం బస్సులు ఫిట్నెస్ చేయించుకోవడానికి రావాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఫిట్నెస్ లేని పాఠశాలల బస్సుల పై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.

1629 బస్సులకు.. సగం బస్సులకే ఫిట్నెస్..

ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పాఠశాలలకు ఫిట్నెస్ అవసరమైన బస్సులు 1629 గా అధికారులు గుర్తించగా ఇప్పటి వరకు దాదాపు 830 బస్సులు మాత్రమే ఫిట్నెస్ సర్టిఫికెట్లు పొందాయని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కాగా కొందరు ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తమ బస్సులకు ఫిట్నెస్ చేయించేందుకు ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయాలు విన్పిస్తున్నాయి. పాఠశాలలు ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఇంకా దాదాపు సగం బస్సులు ఫిట్నెస్ కు రాకపోవడం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల అనాసక్తికి అద్దం పడుతుంది.

ఫిట్నెస్ లేని బస్సులు పట్టుబడితే కఠిన చర్యలు తప్పవు.. డీటీసీ చంద్రశేఖర్..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాల్లో బడి బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఫిట్నెస్ లేని పాఠశాలల బస్సులు రోడ్ల పై తిరిగితే కఠిన చర్యలు తప్పవు.

Advertisement

Next Story

Most Viewed