రేపటి నుండి అమల్లోకి కొత్తచట్టాలు

by Sridhar Babu |
రేపటి నుండి అమల్లోకి కొత్తచట్టాలు
X

దిశ, జగిత్యాల టౌన్ : జూలై 1 నుండి నూతన చట్టాలు అమలులోకి వస్తాయని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన న్యాయ, నేర చట్టాల ద్వారా కేసుల దర్యాప్తులో వేగం, బాధితులకు సత్వర న్యాయం లభిస్తాయన్నారు. దేశ అంతర్గత భద్రతలో కొత్త చట్టాలు నూతన శకాన్ని ప్రారంభించనున్నాయని పేర్కొన్నారు. కొత్తగా రూపొందించిన

భారతీయ న్యాయ సంహిత, నాగరిక్ సురక్ష సంహిత, సాక్ష్యా అధినియం చట్టాలపై జిల్లాలోని పోలీసు అధికారులకు , సిబ్బందికి విడతలవారీగా శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందన్నారు. కొత్త చట్టాల వర్తింపు, నేరాలు, వాటికి సంబంధించిన కేసులతో వ్యవహరిస్తున్నప్పుడు వాటిని ఎలా గ్రహించాలనే దానిపై పోలీసు శాఖకు చెందిన డీఎస్పీ నుండి కానిస్టేబుల్ వరకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

Next Story

Most Viewed