- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఎంపీటీసీల తీరు పై అసంతృప్తి వ్యక్తం చేసిన ఎంపీపీ..
by Sumithra |

X
దిశ, ముస్తాబాద్ : తెలంగాణ రాష్ట్రం సిద్దించి 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేసీఆర్ ఆదేశాల మేరకు దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం అమరవీరులకు ఘననివాళులు అర్పించే కార్యక్రమంతో ఉత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా గురువారం ఎంపీపీ కార్యాలయంలో దశాబ్ది దినోత్సవంలో భాగంగా చివరి రోజున అమరవీరులకు ఘననివాళులు అర్పించే కార్యక్రమం ఉదయం 11 గంటలకు ఉండగా వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీ లు గైర్హాజరు కాగా మరికొందరు సమయానికి హాజరు కాకపోవడంతో ఎంపీపీ శరత్ వారి పై అసహనం వ్యక్తం చేశాడు. అనంతరం కార్యాలయంలో అమరవీరులను గుర్తు చేసుకొని తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంత్ చారి, కానిస్టేబుల్ కిష్టయ్య, మరికొందరు బలిదానం వలన తెలంగాణ ఏర్పడిందని వారికి ఘననివాళులు అర్పించారు. దశాబ్ది ఉత్సవాలు ఘనంగా విజయవంతంగా ముగిసిన సంధర్భంగా మండల ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు.
Next Story