కోడి పందాలు నిర్వహిస్తున్న శిబిరం పై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసుల దాడులు

by Kalyani |
కోడి పందాలు నిర్వహిస్తున్న శిబిరం పై మహేశ్వరం ఎస్ఓటీ పోలీసుల దాడులు
X

దిశ, బడంగ్ పేట్: మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్ పల్లి గ్రామంలోని బాలాజీ వెంచర్ వద్ద కోళ్ల పందాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. కోడి పందాలు నిర్వహిస్తున్న 13 మందిని మహేశ్వరం పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 13,610 వేల నగదు తో పాటు 2 రెండు పందెం కోళ్లు, 16 కోడి పందాల కత్తులు, 5 కోడి పందాల థ్రెడ్, 10 సెల్ ఫోన్ లను ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మహేశ్వరం ఎస్ఓటీ వివరాల ప్రకారం… మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జల్ పల్లి గ్రామంలోని బాలాజీ వెంచర్ వద్ద జల్ పల్లికి చెందిన తెన్నేరు వెంకటేశ్వర్లు (56), జియగూడ కు చెందిన తన్నేరు బ్రహ్మయ్య (43), శ్రీరామ్ కాలనీకి చెందిన బాదినేటి వీరబాబు (58 ), మధుబన్ కాలనీకి చెందిన బారుబోయిన నాగరాజు(35), వజ్జె హరీష్ (33), మహిపాల్ వెంకటేశ్వర్ (50), వేగేసిన ఉదయ్ భాస్కర్ రాజు (30), తన్నేరు రవీందర్( 35), వివాకుల వీర్రాజు(62), చెరుకూరు గోపి( 30), అట్ట పంతుల వెంకట్రావు( 35), బిసల్ సింగ్ (27), దేవరకొండ అంకయ్య( 26) లు గత కొంత కాలంగా కోళ్ల పందాలు నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు కోళ్ల పందెం శిబిరం పై దాడులు నిర్వహించి, 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు వారిని పహాడి షరీఫ్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసును పహాడి షరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story

Most Viewed