- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rajendra Prasad: డేవిడ్ వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బహిరంగ క్షమాపణలు చెప్పిన రాజేంద్ర ప్రసాద్

దిశ, సినిమా: నితిన్ (Nitin), శ్రీలీల (Sreeleela) జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాబిన్‌హుడ్’ (Robinhood). వెంకీ కుడుముల (Venky Kudumula) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌తో పాటు వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్‌డేట్ ప్రేక్షకులను ఆకట్టుకోగా.. భారీ అంచనాల మధ్య ఈ మూవీ ఈ నెల 28న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన మేకర్స్ తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన నటుడు రాజేంద్ర ప్రసాద్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
‘వీడు డేవిడ్ వార్నర్ క్రికెట్ ఆడమంటే పుష్ప స్టెప్పులు వేస్తున్నాడు.. రేయ్ వార్నర్.. దొంగ ము** కొడుకు.. రేయ్ వార్నర్.. నీకు ఇదే వార్నింగ్.. రాబిన్ హుడ్ లాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలి. వెంకీ లాంటి దర్శకులతో మళ్లీ నటించాలి’ అని అన్నాడు. అయితే.. ఈ వ్యాఖ్యలు కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ రాజేంద్ర ప్రసాద్‌ను ఏకిపారేస్తు్న్నారు. సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తూ మండిపడుతున్నారు. తాజాగా ఈ ఇష్యూపై స్పందించిన రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) బహిరంగ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేశాడు.
‘నాకు డేవిడ్ వార్నర్ అంటే ఇష్టం.. నేను అతను క్రికెట్‌ను కూడా ఇష్టపడతాను. అలాగే డేవిడ్ వార్నర్ కూడా మమ్మలిని మా సినిమాలను, నా యాక్టింగ్‌ను ఇష్టపడతారు. నాకు తెలిసి మేము క్లోజ్. ఏదిఏమైనా ఈ జరిగిన సంఘటన మీ మనసును బాధ పెట్టినట్లు అయితే.. నేను ఉద్దేశపూర్వకంగా ఎవరినీ బాధించలేదు.. సరదాగా చేసిన వ్యాఖ్యలు అవి. కానీ వాటి వల్ల మీరు బాధ పడి ఉంటే నన్ను క్షమించండి.. ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.