Vishakhapatnam : డెలివరీ బాయ్ పై దాడి.. నిందితుడి అరెస్ట్

by M.Rajitha |
Vishakhapatnam : డెలివరీ బాయ్ పై దాడి.. నిందితుడి అరెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్ : విశాఖపట్నం(Vishakhapatnam)లో ఓ డెలివరీ బాయ్‌(Swiggy Delivery Boy)పై సోమవారం రాత్రి దాడి(Attack) జరిగింది. కాగా ఈ ఘటనలో నిందితుడు ప్రసాద్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. సీతమ్మ ధారాలోని ఓ అపార్ట్మెంట్ లో స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ ఆర్డర్ డెలివరీ కోసం ప్రసాద్ ఇంటికి వెళ్లినప్పుడు, అతన్ని 'బ్రో' అని పిలవడంతో ప్రసాద్ కోపోద్రిక్తుడై.. 'నన్ను సార్ అని పిలవాలి, బ్రో అని కాదు' అంటూ అనిల్‌పై దాడి చేశాడు. అంతేకాకుండా సెక్యూరిటీ సిబ్బంది సహాయంతో అనిల్‌ను కొట్టి, అతని బట్టలు చించి, గేటు వద్ద నిలబెట్టి క్షమాపణ లేఖ రాయమని బలవంతం చేశాడని పోలీసులు పేర్కొన్నారు.

ఈ దాడిపై డెలివరీ బాయ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీటీవీ ఫుటేజ్, ప్రత్యక్ష సాక్షుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రసాద్‌ను అరెస్ట్ చేసి, కోర్టులో హాజరు పరిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఘటనపై విశాఖలో డెలివరీ వర్కర్లు నిరసనలు చేపట్టారు. డెలివరీ సిబ్బంది భద్రతపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసుల దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement
Next Story