Actress : కరీంనగర్ లో సందడి చేసిన సినీ తారలు..!

by Sumithra |
Actress : కరీంనగర్ లో సందడి చేసిన సినీ తారలు..!
X

దిశ, కరీంనగర్ రూరల్ : కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేటు షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ప్రముఖ సినీ నటులు పాయల్ రాజ్ పుత్, సంయుక్త మీనన్ లు హాజరై నగరంలో సందడి చేశారు. శుక్రవారం నగరంలోని మార్కెట్ ఏరియాలో నూతనంగా స్థాపించిన సీఎంఆర్ షాపింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొని డాక్టర్ భూంరెడ్డితో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి మాల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంఆర్ చైర్మన్ మావూరి వెంకటరమణ, మేనేజింగ్ డైరెక్టర్ మావూరి మోహన్ బాలాజీ మాట్లాడుతూ.. తమ సంస్థను గత 40 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు ఆదరిస్తున్నారని, తమ 32వ షోరూమును కరీంనగర్ లో ప్రారంభించటం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రజలు తమకు కావాల్సిన అన్నిరకాల వేడుకలకు సీఎంఆర్ షాపింగ్ మాల్లో తమ సొంత మగ్గాల పై నేయించిన వస్త్రాలు పలురకాల వెరైటీలతో కుటుంబమంతటికీ నచ్చే విధంగా ఉన్నాయని తెలిపారు. సాధారణ ప్రజలకు సైతం సరసమైన ధరలలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అనంతరం సినీ నటులతో కలసి షోరూంను సందర్శించారు. తారలను చేసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ ఫ్యాన్స్ ను ఆటపాటలతో డ్యాన్సులతో ఉర్రూతలూగించారు.










Next Story

Most Viewed