వేములవాడ రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే

by Mahesh |
వేములవాడ రాజన్నను కుటుంబ సమేతంగా దర్శించుకున్న ఎమ్మెల్యే
X

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: తెలంగాణలో దక్షిణ కాశిగా ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అయిన వేములవాడ శ్రీ రాజ రాజేశ్వరీ స్వామి వారిని బుధవారం ఎమ్మెల్యే రమేష్ బాబు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. రాజన్నను దర్శించుకొనే ముందు ఆలయ ఆర్చకులు వేదమంత్రాలతో ఎమ్మెల్యే రమేష్ బాబు దంపతులకు ఆహ్వానం పలికారు. కోడేమొక్క చెల్లించుకొని అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్త ఆశీర్వచనం గావించారు. అనంతరం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చేయాలని ఆలయ ఈఓ డి.కృష్ణ ప్రసాద్‌కు సూచించారు. స్వామివారి ప్రసాదాన్ని ఎమ్మెల్యే దంపతులకు అందజేశారు. వీరి వెంట ఆలయ పర్యవేక్షకులు తిరుపతి రావు, శ్రీరాములు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed