- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mla:ధర్మపురికి మంచినీటి బాధలు తీరుస్తాః ఎమ్మెల్యే
దిశ, వెల్గటూర్ః ధర్మపురికి మంచినీటి బాధలను తీరుస్తానని ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గురువారం అమృత్ 2.0 మంచినీటి సరఫరా ప్యాకేజీ వన్ కు ఆయన శంకుస్థాపన చేశౄరు. అంనతరం ఆయన మాట్లాడారు. ధర్మపురి ప్రజల తాగునీటి కష్టాల గురించి సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వివరించగా.. ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల తలాపున గోదావరి ఉన్న తాగునీరు దొరకకుండా ఇబ్బంది పడ్డారని తెలిపారు. అమృత్ పేరుతో మంచి నీటి ప్రాజెక్టు శంకుస్థాపన తన చేతుల మీదుగా జరగటం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం ధర్మపురి మున్సిపాలిటిలోని ఇందిరమ్మ కాలనీకి సంబందించిన అర్హులైన 60 మంది లబ్ధిదారులకు ఇంటి నంబర్లను కేటాయించి ఇంటి నంబర్లకు సంబందించిన ఓనర్ షిప్ సర్టిఫికెట్లను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సంగి సత్యమ్మ వైస్ చైర్మన్ ఇందారపు రామన్న కౌన్సిలర్ లు అధికారులు మండలు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.