- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అప్పుడెట్లుండే .. ఇప్పుడెట్లుంది మానాల : మంత్రి ప్రశాంత్ రెడ్డి
దిశ, రుద్రంగి : రుద్రంగి మండలంలోని మానాల గ్రామంలో బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. మానాల గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రజలు బోనాలతో, బతుకమ్మలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం మానాల ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది మానాల అని ప్రజలే ఆలోచించి కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. మానాలలో 100 కోట్లతో అభివృద్ధి చేశానని సీసీ రోడ్లు, ప్రభుత్వ ఆసుపత్రి, తాండల రింగ్ రోడ్డు, సొసైటీ, ఎస్టీ గురుకుల పాఠశాల, తతమ్మ బ్రిడ్జ్, మరిమడ్ల రోడ్డు, పొడు భూముల పట్టాలు, అందించి మానాలను అభివృద్ధి చేశానని అన్నారు.
ఈ సారి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే సాగు నీరు అందించేలా కృషి చేస్తానని అన్నారు. మీ కండ్లముందు కనిపిస్తున్న అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేస్తే తాను ఎమ్మెల్యే అవుతానని, అనంతరం కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవుతాడని అన్నారు. ఈ కార్యక్రమంలో, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దెగవత్ తిరుపతి, వైస్ ఎంపీపీ పిసరి భూమయ్య, కమ్మర్పల్లి జడ్పీటీసీ రాజగౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బాధనవేణి రాజారాం, ఎంపీటీసీ గుగులోత్ గంగిబాయి, అన్ని గ్రామాల సర్పంచ్ లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.