- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆల్వేస్ ఐయామ్ రెడీ: మంత్రి గంగుల కమలాకర్
దిశ, కరీంనగర్ టౌన్: నూతనంగా ఎంపికైన జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులు దళితులకు, ప్రభుత్వానికి వారధిగా ఉండి దళితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అధ్యక్షతన నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కమిటీ సభ్యులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా పని చేయాలన్నారు. దళిత వర్గాలపై దాడి జరిగినప్పుడు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సభ్యులు పదవులకు న్యాయం చేయాలని, ఈ విషయంలో కమిటీ సభ్యులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందించేందుకు తాను సిద్దంగా ఉన్నానని అన్నారు. రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు కేవలం దళితుల కోసమే కాదని, దేశానికి సరైన మర్గాన్ని సూచించేలా రాజ్యాంగాన్ని తీర్చిదిద్దారన్నారు.
అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడుస్తున్నా ఇంకా ఇప్పటికీ దళితులపై వివక్షత కొనసాగడం బాధాకరమన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, పోయాయని గానీ దళితుల జీవితాల్లో వెలుగులు నింపడంలో విఫలమయ్యారన్నారు. దళితుల సంక్షేమం కోసం బడ్జెట్ అంటూ నాటి పాలకులు అందుకోసం సవాలక్ష నిబంధనలు పెట్టడంతో అవి దళితులకు సత్ఫలితాలను ఇవ్వలేదన్నారు. కానీ సిఎం కేసీఆర్... ఎలాంటి నిబంధనలు లేకుండా.... దళితులను ఆర్థికంగా బలోపేతం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. దళిత వర్గాలకు న్యాయం జరగాలనే నూతన కమిటీ దళితులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలువాలన్నారు. ప్రతి 3 నెలల కోసారి మీటింగ్ ఏర్పాటు చేసుకుని... దళితుల అభివృద్ది కోసం తీసుకోవల్సిన చర్యలపై చర్చించుకుందామన్నారు. దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ చేపట్టిన దళితబంధు పథకం ఒక గొప్ప పథకమని... దళితులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని సూచించారు.
ఇట్టి సమావేశంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై సమీక్షించి ఈ సంవత్సరంలో అట్రాసిటీ బాధితులకు ఇప్పటివరకు రూ. 50.25 లక్షల పరిహారం చెల్లించారు. ఈ సంవత్సరంలో నమోదైన అట్రాసిటీ కేసులు మొత్తం 95 గాక 21 తప్పుడు కేసులు, 33 చార్జ్ షీట్, 41 ఇన్వెస్టిగేషన్ లో ఉన్నావి. ఇట్టి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిహారం మరియు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయవలసిందిగా మంత్రి అధికారులను సూచించారు.
ఈ సమావేశంలో పోలీస్ కమిషనర్, సత్యనారాయణ, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. పవన్ కుమార్, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ డిప్యూటీ డైరెక్టర్ నతినియల్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగార్జున, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి గంగారం, కలెక్టరేట్ ఏఓ డాక్టర్ కె. నారాయణ, ఉప కార్యనిర్వాహక సమాచార ఇంజనీరు కొండయ్య, హుజరాబాద్ ఆర్డీఓ హరీష్, తహశీల్దార్ బి. రాజేశ్వరి, నూతనంగా ఎన్నికైన జిల్లా స్థాయి విజిలెన్స్ మరియు మౌనిటీరింగ్ కమిటీ సభ్యులు మేడి మహేష్, ఎలుక ఆంజనేయులు, కులదీప్ వర్మ, తడగొండ నర్సింహ బాబు, లకావత్ రవి, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.