మామిడి చెట్టా...మజాకానా...

by Disha Web Desk 15 |
మామిడి చెట్టా...మజాకానా...
X

దిశ, గంగాధర : సాధారణంగా మామిడి చెట్టుకు కాయలు కొమ్మలకు కాస్తాయి. ఒక్క చోట మహా అంటే రెండు మూడు కాయలు కంటే ఎక్కువ కాయవు. ఒకవేళ కాసినా అవి పిందె దశలోనే రాలిపోతాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న మామిడి చెట్టును చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. చనిపోయిందనుకున్న చెట్టు నేరుగా గుత్తులుగుత్తులుగా ఒకే చోట 25 కాయలు కాసి అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

అంటే పూతమొత్తం కాయలుగా మారింది. వివరాల్లోకి వెళితే లక్ష్మీదేపల్లె గ్రామంలోని కర్ర జగన్ మోహన్ రెడ్డి అనే రైతు పొలంలోని మామిడి చెట్టు గత ఏడాది ఈదురు గాలులకు కొమ్మలు విరిగిపోయాయి. చెట్టు ఎండిపోయే దశకు చేరుకుంది. ఇక ఈ చెట్టు కాయదనుకున్నప్పటికీ చిగురించింది. పక్కపక్కనే గుత్తులుగా సుమారు యాభై కాయలకు పైనే కాసింది. దాంతో దీనిని చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Next Story

Most Viewed