AP Politics:కులాల మధ్య యుద్ధం కాదు..ఇప్పుడు జరిగేది క్లాస్ వార్:సీఎం జగన్

by Jakkula Mamatha |   ( Updated:2024-05-04 07:43:48.0  )
AP Politics:కులాల మధ్య యుద్ధం కాదు..ఇప్పుడు జరిగేది క్లాస్ వార్:సీఎం జగన్
X

దిశ ప్రతినిధి,ఉభయగోదావరి: మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు మీ బిడ్డకు మీరే సైనికులుగా, అండగా నిలవాలని, ప్రస్తుత ఎన్నికల్లో జరిగేది కులాల మధ్య యుద్ధం కాదని, ఇప్పుడు జరుగుతున్నది క్లాస్ వార్‌గా సీఎం జగన్ పేర్కొన్నారు. ఇది పేదలకు,పెత్తందార్లకు మధ్య జరుగుతున్న యుద్ధం అని నరసాపురం స్టీమర్ రోడ్డు కూడలిలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో జగన్ తెలిపారు. 2019లో నాకు ఓటు వేయని ప్రజలతో సహా ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నాను అని, మీ ఇళ్లకు వెళ్లి మీ భార్య, అవ్వ తాతలతో, మీ కుటుంబ సభ్యులతో చర్చించండని సూచించారు.

నా పాలనలో మీరు లబ్ధి పొందారని విశ్వసిస్తే నాకు ఓటు వేయాలన్నారు. వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ద్వారా అవినీతి రహిత పాలనను నా ప్రభుత్వం కొనసాగిస్తుందని మీరు విశ్వసిస్తే, ఫ్యాన్‌ గుర్తు పై రెండు బటన్లను నొక్కండన్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండన్నారు. ప్రస్తుతం పెన్షన్ దారుల కష్టాలకు ఎవరు కారణమో మీకే తెలుసని, అటువంటి వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు. నరసాపురం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడురి ఉమబాలతో పాటు నరసాపురం పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ అభ్యర్థులందరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.

Read More..

చర్చకు సిద్ధమా.. బాలకృష్ణకు మంత్రి బొత్స సవాల్

Advertisement

Next Story

Most Viewed