Huzurabad: పిచ్చి కుక్క హతం.. ఊపిరి పీల్చుకున్న జనం

by srinivas |
Huzurabad: పిచ్చి కుక్క హతం.. ఊపిరి పీల్చుకున్న జనం
X

దిశ, హుజురాబాద్: హుజురాబాద్, జమ్మికుంట ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పిచ్చి కుక్కను మున్సిపల్ సిబ్బంది, డాగ్ స్కాడ్ హతమార్చారు. జమ్మికుంటలో బుధవారం సాయంత్రం పలువురిని కరిచిన పిచ్చి కుక్క హుజురాబాద్‌కు వెళ్లింది. అక్కడ దాదాపు 25 మందిపై ఇష్టమొచ్చినట్లు దాడి చేసింది. ఇందులో ఒకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. వరంగల్ ఎంజీఎం కు తరలించారు. అప్పటినుంచి హుజురాబాద్‌లో మున్సిపల్ సిబ్బంది, ప్రజలు కుక్క కోసం గాలింపు చర్యలు చేపట్టగా గురువారం తెల్లవారుజామున మున్సిపల్ సిబ్బంది, డాగ్ స్కాచ్ ఎట్టకేలకు హతమార్చారు. ఈ కుక్క దాడిలో జమ్మికుంట, సైదపూర్, హుజురాబాద్‌లో సుమారు 50 మంది పై దాడి చేసినట్లు అధికారిక సమాచారం.వీరు వరంగల్ , హుజురాబాద్ ఆసుపత్రులో చికిత్సలు పొందుతున్నారు.

మరో ముగ్గురిపై పిచ్చి కుక్క దాడి

బుధవారం హుజురాబాద్ లో దాడి చేసి 25 మందిని గాయ పరిచిన పిచ్చి కుక్క గురువారం తెల్ల వారు జమున మరో ముగ్గురిపై దాడి చేసి గాయ పరిచింది.ఇందులో ఒకరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

హుజురాబాద్‌లో మరిన్ని కుక్కల సంచారం

హుజురాబాద్ లో గురువారం పిచ్చికుక్క హతం అయినప్పటికీ పట్టణంలో మరిన్ని కుక్కల సంచారం జరుగుతున్నట్లు ప్రజలు తెలుపుతున్నారు.దీంతో మున్సిపల్ సిబ్బంది వాటి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ రాధిక

పట్టణంలో పిచ్చి కుక్కల స్వైర విహారం ఉన్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,కొంత కాలం పాటుగా పెంపుడు కుక్కలను జాగ్రత్తగా ఉంచుకోవాలని,బయటకు విడిచి పెట్టవద్దని తెలిపారు.

పేరుకే 100 పడకల ఆసుపత్రి

హుజురాబాద్ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రి గా చేశామని,చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆసుపత్రులకు పోకూడదని చెపుతున్న అధికారులు ఇందులో కనీస సౌకర్యాలు,మందుల కొరత విషయం లో నిర్లక్ష్యం వీడడం లేదు.బుధవారం సాయంత్రం పిచ్చికుక్క దాడిలో గాయ పడ్డ వారికి చికిత్స చేసే మందులు లేకపోవడం సిగ్గు చేటయిన విషయం అని పుర ప్రజలు వాపోతున్నారు. వర్షాకాలంలో పిచ్చి కుక్కల స్వైర విహారం ఉంటుందన్న విషయం తెలిసినా అధికారులు ముందు జాగ్రత్త చర్యగా మందులు తెప్పించక పోవడం దారుణమని, వెంటనే అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.



Next Story