- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Colonists protest : ఎక్కడి సమస్యలు అక్కడే..
దిశ, రామగిరి : లద్నాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, కనీసం డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయకపోవడంతో వర్షాలకు నీరు నిలిచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సోమవారం కాలనీ వాసులు నిరసన వ్యక్తం చేశారు. రామగుండం 3 ఏరియా ఓసీపీ2 విస్తరణలో ఇండ్లు, భూములు కోల్పోయిన లద్నాపూర్ నిర్వాసితులకు సింగరేణి యాజమాన్యం రామగిరి మండలంలోని పన్నూరు, రత్నాపూర్ పరిధిలో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గ్రామంలోని రోడ్డుకు ఒకవైపున్న ఇండ్లను రెండు సంవత్సరాల క్రితం తొలగించడంతో గ్రామస్తులు వారికి కేటాయించిన స్థలంలో ఇండ్లు నిర్మించుకున్నారు.
మరికొందరు నిర్మాణాలు చేపడుతున్నారు. అయితే ఇండ్లు నిర్మించుకుని నెలలు గడుస్తున్నా అభివృద్ధి పనులు మాత్రం ముందుకు సాగడం లేదని వాపోయారు. గత ఏడాది నుంచి డ్రైనేజీ కోసం గ్రామస్తులు అడుగుతున్న సింగరేణి నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. నీరు నిలిచి దోమలతో రోగాల బారిన పడుతున్న పట్టించుకోవడం లేదన్నారు. అంతేకాకుండా మరోవైపు తుమ్మలు మొలిచి పాములు సంచరిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. సింగరేణి అభివృద్ధి కోసం సర్వం కోల్పోయిన మమ్మల్ని అవస్థలకు గురి చేయడం సరికాదన్నారు. ఇప్పటికైనా సింగరేణి అధికారులు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, ఆర్ అండ్ ఆర్ కాలనీలో అభివృద్ధి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
ఇండ్లు ఖాళీ చేయాలని సింగరేణి ముమ్మర ప్రయత్నాలు..
లద్నాపూర్ గ్రామంలో మరోవైపున ఇండ్లను ఖాళీ చేసేందుకు సింగరేణి అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఉదయం కాగానే గ్రామంలో వాలిపోతున్నారు. ఆర్ అండ్ ఆర్ కాలనీలో సమస్యలు పరిష్కరించకుండా ఎలా ఖాళీ చేయమంటారని గ్రామస్తులు ప్రశ్నిస్తే పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. గ్రామంలో పోషమ్మ గుడి తరలింపు జరగలేదని, రామాలయం నిర్మాణం ఇంకా చేపట్టకుండానే ఇండ్లు ఖాళీ చేయాలంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లద్నాపూర్ ఆర్ అండ్ ఆర్ కాలనీకి సంబంధించి గుడి, పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాల్, వినాయక మండపం, మిగతా అభివృద్ధి పనులు చేయాలని, సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాతనే ఇండ్లు ఖాళీ చేస్తామని కొందరు గ్రామస్తులు సింగరేణి అధికారులకు తేల్చి చెప్పారు. ఇన్ని సమస్యలు ఉన్న కనీసం ఎవరు పట్టించుకోవట్లేదని, ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు.