- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ కథనానికి స్పందన.. మానవత్వం చాటుకున్న కేటీఆర్
దిశ, సిరిసిల్ల : దిశ కథనానికి స్పందన లభించింది. నవంబర్ 26 ఆదివారం రోజున దిశ వెబ్సైట్లో చిన్న బాబుకు పెద్ద కష్టం అని వచ్చిన కథనానికి మంత్రి కేటీఆర్ స్పందించారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన రాపల్లి ప్రదీప్ తేజశ్రీ దంపతుల కుమారుడు నిహాల్ బ్రెయిన్ హ్యూమర్ వ్యాధితో బాధపడుతున్నాడని దిశ పత్రికలో వచ్చింది. నిరుపేదల పెన్నిధిగా పేరు ఉన్న కేటీఆర్ నిహాల్ తక్షణ వైద్య ఖర్చుల నిమిత్తం నాలుగు రోజుల క్రితం 60 వేల రూపాయలు అందజేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజీగా ఉన్న కేటీఆర్ గురువారం పోలింగ్ ముగియడంతో ఫ్రీ అయ్యారు. శుక్రవారం బాధిత కుటుంబం స్థితిగతులు, నిహాల్ ఆరోగ్య పరిస్థితులు తెలుసుకున్నారు.
నిహాల్ వైద్యానికి కావలసిన ఖర్చుల బాధ్యత తనదేనని హామీ ఇచ్చినట్లు నిహాల్ తల్లిదండ్రులు తెలిపారు. అంతేకాకుండా దాతలు, స్వచ్ఛంద సంస్థలు సహకారం అందించడానికి ముందుకు వస్తున్నాయని దిశ పత్రిక యాజమాన్యానికి బాధిత కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ తన సిబ్బందిని పంపించి, నిహాల్ పూర్తి వివరాలు సేకరించి ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఇంత బిజీ షెడ్యూల్ లోను నిహాల్ కుటుంబానికి అండగా నిలిచి మరో మారు మానవత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్ పై జిల్లా ప్రజలు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. దీన్నిబట్టి సిరిసిల్ల నియోజకవర్గ ప్రజల పై తనకున్న మమకారం తెలుస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.