- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Teenmar Mallanna :'తీన్మార్ మల్లన్న ఏమైనా తీవ్రవాదా?'
దిశ, రామగిరి: తీన్మార్ మల్లన్న ఏమైనా తీవ్రవాదా, ఉగ్రవాదా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అన్నారు. మల్లన్న వాహన యాత్ర శుక్రవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సెంటినరీ కాలనీకు చేరుకుంది. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది తెల్ల ఏనుగు లాంటిదని, దాన్నే మనం బతికించాలి తప్ప అది మనల్ని బతికించదన్నారు. ధరణి పోర్టల్ ఒక బోగస్ అని, దాని ద్వారా పేద రైతుల 3లక్షల ఎకరాలను దొరలు దోచుకోనే పన్నాగం అది అన్నారు. భవిష్యత్తులో రైతు బంధు అనే పథకం అనేది ఉండదని పేర్కొన్నారు. కాళేశ్వరం కట్టి కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తున్న, వ్యవసాయ బావులకు ఉచితంగా కరెంట్ ఇస్తున్న అని చెప్తున్న కేసీఆర్ కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇస్తే బావులకు కరెంట్ ఎందుకు అని ప్రశ్నించాడు.
కేసీఆర్ ప్రభుత్వం ఒక్క ఇంట్లో ఒక్కరికే పెన్షన్ ఇస్తా అని అంటున్నారు. అలాంటప్పుడు ఒక్క ఇంట్లో ఒక్కరికే మంత్రి పదవి ఇవ్వాలి అని ప్రశ్నించినందుకు తీన్మార్ మల్లన్న పై కేసులు పెడుతున్నారని వెల్లడించారు. ఇప్పటికే 51కేసులు పెట్టారని, ఇంకో 500కేసులు పెట్టిన భయపడేది లేదన్నారు. సింగరేణి కార్మికులను, కాంట్రాక్టు కార్మికులను ఎన్నో రకాలుగా కేసీఆర్ మోసం చేస్తున్నారని, అందుకే ప్రత్యక్షంగా కలిసి వారి బాధలు తెలుసుకోవడానికే వచ్చానన్నారు. తీన్మార్ మల్లన్న కార్మికులను కలవకుండా సింగరేణి యాజమాన్యం సర్కులర్ జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ ఆయన కుటుంబం మన జీతగాళ్లని, మనం కట్టే పన్నుతోనే వాళ్లు బతుకుతున్నారని తెలిపారు. మన ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు పనులు చెయ్యకపోతే, రీకాల్ తో మన ఓటు హక్కు వెనక్కు తీసుకునే అధికారం ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దాసరి భూమయ్య, తదితరులు పాల్గొన్నారు.
కమీషన్ల కోసమే AMR సంస్థకు కోల్ మైనింగ్ ప్రాజెక్టు: తీన్మార్ మల్లన్న
- Tags
- Teenmar Mallanna