- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నుల పండుగగా రాములోరి రథోత్సవం
దిశ,జమ్మికుంట: అపర భద్రాద్రిగా పేరుగాంచిన ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి రథోత్సవం గురువారం రాత్రి వైభవంగా ప్రారంభం అయింది. పాదయాత్రకు రథయాత్రకు రాష్ట్ర నలుమూలల నుండి వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి ఇచ్చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులు కోనేరులో స్నానానికి వెళ్ళగా కోనేరు చుట్టుపక్కల మందుబాబులకు ప్రధాన అడ్డగా మారిందని ఆరోపిస్తూన్నారు. ఉత్తర తెలంగాణలోని ప్రధాన ఆలయంగా పేరుగాంచిన సీతారామ ఆలయం లో కనీస సౌకర్యాలు లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గత నెల 30 న సీతారామస్వామి కళ్యాణం జరగగా గురువారం స్వామివారి రథయాత్రకు విచ్చేసిన భక్తులు కోనేరులో స్నానాలు చేసేందుకు కనీస సౌకర్యాలు కూడా లేకుండా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో మంత్రిగా, ప్రస్తుతం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్నప్పటికీ, నేడు అధికార పార్టీ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రభుత్వ విప్ గా కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఆలయ కోనేరు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు కోనేరుల స్నానం చేయడానికి వెళ్ళగా కోనేరు చుట్టూ మందు సీసాలు దర్శనం ఇచ్చేసరికి భక్తులు అవ్వక్కయ్యారు. ఇప్పటికైనా అధికారులు కల్పించుకొని కోనేరును అభివృద్ధిలోకి తీసుకరావాలని భక్తులు కోరుతున్నారు.+