పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి

by Mahesh |
పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
X

దిశ, మెట్‌పల్లి: ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన మెట్ పల్లి పట్టణ శివారులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మెట్ పల్లి పట్టణానికి చెందిన ఓంకార్ సుబ్బరాజు అనే హోంగార్డు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే గురువారం తెల్లవారుజామున మెట్ పల్లి లోని ఒక టిఫిన్ సెంటర్‌కు వెళ్లి టిఫిన్ తీసుకొని ఇంటికి తిరుగు ప్రయాణంలో నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ts16 uc9963 నంబర్ గల బస్ స్థానిక హోండా షోరూమ్ వద్ద డీకొనగా హోమ్ గార్డ్ అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మెట్ పల్లి ఎస్సై చిరంజీవి ఘటన స్థలానికి చేరుకుని హోంగార్డు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story