రేకుర్తి ప్రజల బాధలు వర్ణనాతీతం : కాంగ్రెస్ నాయకులు

by samatah |
రేకుర్తి ప్రజల బాధలు వర్ణనాతీతం : కాంగ్రెస్ నాయకులు
X

దిశ, కరీంనగర్ టౌన్ : హాత్ సే హాత్ జోడో పాదయాత్ర నేడు రేకుర్తి 18 వ డివిజన్ లో కొనసాగింది. బాలబద్రి శంకర్, ఎండి చాంద్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి‌తో పాటు నాయకులు కార్యకర్తలు ఈ యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేకుర్తి గ్రామం కార్పొరేషన్‌లో విలీనమైనప్పటికీ ఇప్పటికీ పెంటకమ్మ చెరువు నీరుపైనే ఆధారపడింది. తాగునీరుకు నోచుకోని దుస్థితి ఉందని పేర్కొన్నారు. డివిజన్‌లో వరదనీటితో పాటు మురికినీరు ఎక్కడికక్కడ

నిలిచి ఉండడం వల్ల దుర్వాసన వెదజల్లుతోందని, దోమలు స్వైరవిహారం చేస్తున్నాయన్నారు. రోడ్లులేవు, మురికి కాలువలు లేవు, డివిజన్లో అద్వాన్నమైన పరిస్థితి నెలకొందని నరేందర్ రెడ్డి అన్నారు. గడప గడపకు వెళ్లి ప్రజలతో మాట్లాడుతూ పాదయాత్రలో సమస్యలను తెలుసుకుంటూ డివిజన్ మొత్తం పర్యటించారు. ఈ కార్యక్రమంలో మడ్లపల్లి శ్రీనివాస్, ఎం డి బషీరొద్దిన్, గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, జీడీ రమేష్, సలిమొద్ధిన్, షబానా మహమ్మద్, ఉరడి లత, ముల్కల కవిత, కీర్తి కుమార్, షేక్ శేహెన్ష, నదీo, అజ్మత్, హనీఫ్, మెతుకు కాంతయ్య తది తరులు పాల్గొన్నారు.

Next Story