సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణకు జీవో.నెం.76: ఎమ్మెల్యే కోరుకంటి చందర్

by Shiva |
సింగరేణి స్థలాల క్రమబద్ధీకరణకు జీవో.నెం.76: ఎమ్మెల్యే కోరుకంటి చందర్
X

దిశ, గోదావరి ఖని: దశాబ్దాల కాలంగా ప్రజల కళను సాకరం చేశామని, సింగరేణి స్దలాల్లో నివాసాల క్రమబద్ధీకరణ కోసం సీఎం కేసీఆర్‌ కు విన్నవించి జీవో నెం.76 అమలు చేయించామని ఆయన తెలిపారు. ఆ స్థలాల్లో నివాసం ఉండే ప్రజలందరికీ త్వరలలోనే జీవో నెం.76 ద్వారా పట్టాలను అందజేయనుట్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గారు అన్నారు. శుక్రవారం స్థానిక మార్కండేయ కాలనీలోని లక్ష్మీ ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన సింగరేణి ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ లబ్ధిదారుల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

దశాబ్దాల కాలం పాటు ప్రభుత్వ స్థలాల్లో నివసించిన వారికి ఇళ్ల స్థలాలు కేటాయించాలని అసెంబ్లీలో ప్రస్తావించానని. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా జీవో నెంబర్ 76 ద్వారా పట్టాల పంపిణీకి ప్రణాళికలు పొందించారన్నారు. రాబోయే కాలంలో సొంత స్థలం ఉన్నవారికి గృహలక్ష్మి పేరిట ఇల్లు నిర్మించుకునేందుకు రూ.మూడు లక్షలు ఆర్థిక సాయం అందజేస్తామమని అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, ప్రజల ఆదరణను చూరగొంటున్నారన తెలిపారు.

రాష్ట్రంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకం అందుతుందనడంలో అతిశయోక్తి లేదన్నారు. సమాఖ్య పాలనలో తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరిగిందని అన్నారు. అదేవిధంగా రామగుండం ప్రజానీకం ఆరోగ్యం కోసం మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడం జరిగిందని, 24 గంటలపాటు వైద్యంతోపాటు పరీక్షలు మందులను అందజేయడం జరుగుతుందన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మెడికల్ కళాశాల కేవలం రామగుండం లోనే ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆరోగ్య భరోసాగా మెడికల్ కళాశాల రూపొందడం ఎంతో గర్వించదగిన విషయం అన్నారు.

రామగుండంలో నిరంతర అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నప్పటికీ, ప్రజలకు శాశ్వత ప్రయోజకరంగా ఉండాలని మెడికల్ కళాశాలను సాధించామన్నారు. రామగుండంలో సుమారుగా 26,000 మందికి ఆసరా పెన్షన్లు, 6,500 మందికి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ లను అందించామన్నారు. కాగా స్థానిక ప్రజానిక సౌకర్యం కోసం రామగుండంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని సైతం సాధించడం జరిగిందన్నారు. కాగా జీవో నెంబర్ 76 మరో రెండు నెలలు పొడిగించారు.

2020 సంవత్సరంలోపు ప్రభుత్వం, సింగరేణి స్థలాల్లో నివాసం ఉండే అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యేకు సూచించారు. అనంతరం 962మంది లబ్ధిదారులకు పట్టాలను గారు పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, తహసిల్దార్ జాహిద్ పాషా కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, కొమ్ము వేణుగోపాల్, బాధే అంజలి దేవి, నాయకులు కలువల సంజీవ్ జిట్టవేణి ప్రశాంత్, నూతి తిరుపతి, అడప శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, దొమ్మేటి వాసు, కొర్రి ఓదెలు, కెక్కర్ల సతీష్, బాసంపల్లి జడ్సన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story