- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Godavari : గోదావరి పరివాహక గ్రామాలను అప్రమత్తం చేసిన.. కలెక్టర్ సత్యప్రసాద్..
దిశ, మెట్ పల్లి / ఇబ్రహీంపట్నం : గత పది రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఇబ్రహీంపట్నం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్దండి, గ్రామ గోదావరి ప్రవాహాన్ని పరిశీలించి ఎగువన మహారాష్ట్రలోని భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చే అవకాశం ఉందని వాటిని దృష్టిలో పెట్టుకొని గోదావరి పరివాహక గ్రామస్తులు, రైతులు, మచ్చకారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
అలాగే గత సంవత్సరం వరద ఎక్కడి వరకు వచ్చింది. ముంపునకు గురైన కుటుంబాలెన్నో వారిని ఎక్కడికి తరలించారనే విషయాలను అడిగి తెలుకున్నారు. మండల, గ్రామస్థాయి అధికారులు ఎప్పటికికప్పుడు గోదావరి ప్రవాహాన్ని పర్యవేక్షణ లో ఉండాలని కోరారు. కలెక్టర్ వెంట తహశీల్దార్ ప్రసాద్, సెక్రటరీ మనోజ్ గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.