- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఎంజాయ్మెంట్ సర్వేపై అభిప్రాయాలు తెలపండి
దిశ, రామగిరి : బుధవారంపేట, రాజాపూర్ గ్రామాల్లో చేపట్టిన ఎంజాయ్మెంట్ సర్వేపై రైతులు తమ అభిప్రాయాలను తెలియజేస్తూ దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం కలెక్టర్ మండలంలోని రాజాపూర్, బుధవారం పేట గ్రామాలలో అదనపు కలెక్టర్ జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డులు సరిచేయడానికి బుధవారం పేట, రాజాపూర్ గ్రామాలలో దాదాపు 700 ఎకరాల ఎంజాయ్మెంట్ సర్వే పూర్తి చేశామని తెలిపారు. గ్రామంలో పూర్తి చేసిన సర్వేపై రైతులు ఎవరికైనా అభ్యంతరాలు ఉన్నా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతుల అంగీకారంతో సర్వే నివేదిక ప్రకారం పట్టాదారు పాస్‌పుస్తకాలు రైతులకు జారీ చేయడానికి తహసీల్దార్, ఆర్డీఓకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని ఆర్డీఓ బి.గంగయ్య, రామగిరి ఎమ్మార్వో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.