- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
బీఆర్ఎస్ నేతల ఫ్రస్టేషన్.. ప్రభుత్వ కార్యాలయంలో పనిచేయని పేరు
దిశ, రామడుగు : బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కార్యాలయాల్లో ఫైరోవీలతోని పనులు జరిగేవి. వారి పేరు చెబితే చాలు నాలుగు రోజుల్లో అయ్యే పని గంటలో అయినవంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పథకాలైన, సెటిల్మెంట్లు అయినా వారికి పెట్టిందే పేరు. ఒక్కసారిగా ప్రభుత్వం మారడంతో కార్యాలయాల్లో వారి పేరు చెబితే పనులు కాకపోవడంతో ఒక్కసారిగా బీఆర్ఎస్ నేతలు పునరాలోచనలు పడ్డారు. నిన్న మొన్నటి వరకు ఖద్దరు చొక్కా వేసుకొని ఆఫీసుకు వస్తే పనులు ఇట్టే అయ్యేవి కానీ ఇప్పుడు మాత్రం పనులు జరగకపోవడంతో ఒక్కసారిగా నేతలు డీలపడ్డట్టు మండలం లో కనిపిస్తుంది.
అతి విశ్వాసమే కొంపముంచింది...
అసెంబ్లీ ఎన్నికల ముందు మా ప్రభుత్వమే వస్తుంది ప్రభుత్వం వచ్చాక మొదటిసారిగా నీకు ఆ పథకం ఇస్తానని కొందరు నేతలు గ్రామాల్లో వాగ్దానాలు ఇవ్వడంతో ఇప్పుడు అవి వారి మెడకు చుట్టుకునేంత పనైందని గ్రామాల్లో జోరుగా చర్చ సాగుతోంది. అంతేకాకుండా కాంగ్రెస్ లో ఉన్నవారు కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ కండువా కప్పుకొని తప్పు చేసామే అని ఇప్పుడు నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఆ పని చేసిన వారంతా ఇప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు పిలుస్తుందా అన్నట్లుగా చూస్తున్నారే అని మండల కేంద్రంలో జనాలు కోడై కుస్తున్నారు. ఇట్టి సమయంలో నేతలు పార్టీ మారాలా లేక ఇదే పార్టీలో కొనసాగాలా అని ఫ్రస్టేషన్ కు లోనవుతున్నారు.
ఇల్లీగల్ దందాలకు చెక్ పెట్టనున్న అధికారులు..?
తమ ప్రభుత్వమే ఉన్నదని ధీమాతో ఇష్టానుసారంగా ఎటువంటి అనుమతులు లేకుండా జోరుగా ఇల్లీగల్ దందా చేసుకున్న నేతలకు ఇప్పుడు అధికారులు వాటికి చెక్ పెట్టనున్నట్లు కనిపిస్తుంది. గతంలో ఎన్ని ఇల్లీగల్ పనులు చేసిన అధికారులు చెప్పినా కూడా వినకపోవడంతో వారిని కూడా ట్రాన్స్ఫర్ చేసిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారడంతో మండల అధికారులు వారి ఇల్లీగల్ దందాలకు చెక్ పెట్టనున్నట్లు కనిపిస్తుంది.దీనికి తోడుగా మండలంలో అధికారులు మారుతున్నారని విశ్వసనీయ సమాచారం. మరి మండలంలో బి ఆర్ ఎస్ నేతలు చేసేదేమీ లేక కండువాలు మార్చే పనుల్లో నిమగ్నమయ్యారని మండలంలో ప్రజలు గుసగుసలాడుతున్నారు.