forest officials : వ్యవసాయ బావిలో పడ్డ నక్కలు..!

by Sumithra |
forest officials : వ్యవసాయ బావిలో పడ్డ నక్కలు..!
X

దిశ, కథలాపూర్ : జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామ శివారులో తొర్తి గంగ నర్సయ్య అనే రైతుకు చెందిన వ్యవసాయ బావిలో అటుగా వచ్చిన రెండు నక్కలు అదుపుతప్పి పడ్డాయి. గమనించిన అతను అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. స్పందించిన అటవీశాఖ అధికారులు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇంచార్జ్ గోవిందారం ఎండీ ముషీర్ అహ్మద్ సిద్ధిక్, బీట్ ఆఫీసర్ గోవిందారం మధుసూదన్, వాచర్స్ ఆధ్వర్యంలో సిబ్బంది స్థానిక రైతులతో కలిసి బావిలో పడ్డ రెండు నక్కలను వలల సహాయంతో బయటకు తీసి అటవీలో వదిలిపెట్టారు. దీంతో అధికారులు, రైతులు, జంతు ప్రేమికులు రెండు నక్కలు ప్రాణాలతో బయటపడటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు అటవీశాఖ అధికారుల చొరవను, కృషిని ప్రత్యేకంగా అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed