- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించిన టీపీసీసీ ఉపాధ్యక్షులు..
దిశ, సుల్తానాబాద్ : సుల్తానాబాద్ మండలం భూపతిపూర్, ఐత రాజ్ పల్లి, నర్సయ్య పల్లి, గర్రెపల్లి గ్రామల్లో శనివారం రాత్రి కురిసిన వడగళ్ళ వర్షానికి చేతికి వచ్చే సమయంలో పంటలు దెబ్బతినడం చాలా బాధాకరమని టీపీసీసీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. అలాగే చేతికి వచ్చిన పంట దెబ్బతినడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారన్నారు. పంట నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శనివారం సాయంత్రం కురిసిన వర్షానికి నాశనం అయిన పంటలను చూడకుండా, రైతులను పట్టించుకోకుండా ఉన్నారన్నారు.
కన్నీళ్లు పెడుతున్నా రైతులను పట్టించుకోని ఈ దద్దమ్మ ఎమ్మెల్యే ఎందుకు ఉన్నట్టు, స్థానిక ఎమ్మెల్యే తక్షణమే పంట పొలాలను సందర్శించి నష్ట పోయిన రైతులకు ప్రభుత్వం నుండి ఎకరానికి ₹30,000 /- రూపాయలను ఆర్థిక సహాయం అందించాలని లేని పక్షంలో రైతులతో కలిసి ఎమ్మెల్యే ఇంటి ముందు ధర్నా చేస్తానని అన్నారు. అలాగే ఇప్పటికైనా ఎమ్మెల్యే కళ్ళు తెరిచి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పంట నష్టపోయిన రైతులు, మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్లెపల్లి జానీ, కవ్వపల్లి తిరుపతి, వెగోళం అబ్బయ్య గౌడ్, పన్నాల రాములు, పులి అనూష వెంకటేష్, ఎర్రం రాజిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.