- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Flexi lolli : రామగుండంలో ఫ్లెక్సీ లొల్లి
దిశ,పెద్దపల్లి : రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం కేశవరం సిమెంట్ కర్మాగారం వద్ద ఫ్లెక్సీ వార్ మొదలైంది. రామగుండం మండలం పాలకుర్తిలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నాయకుల ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చించివేశారు. మొన్న జరిగిన కేషోరం సిమెంట్ కార్మిక సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ ఫ్యానల్ నుంచి పోటీ చేసిన కౌశిక్ హరి కాంగ్రెస్ ఫ్యానల్ అభ్యర్థిపై నెగ్గాడు. దీంతో రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు కలిసి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
దీంతో గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలను చింపి వేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ నేతల పని అని రామగుండం బీఆర్ఎస్ ఆరోపించింది. కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ ఎన్నికల్లో ఓటమి జీర్ణించుకోలేకనే ఇలాంటి చిల్లర పనులకు ఒడి గడుతున్నారని రామగుండం బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండి పడుతున్నారు. రామగుండం నియోజకవర్గంలో ఎప్పుడూ లేని విధంగా ఫ్లెక్సీలు చింపడం ఇదెక్కడి రాజకీయం అంటూ కౌశిక హరి కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఆయన వాపోయారు. ఇలాంటి చిల్లరగా ఫ్లెక్సీ లు చించడం ఏంటని..? ఆయన తీవ్రంగా మండి పడ్డారు.