- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లింట్లో అగ్ని ప్రమాదం.. రూ.లక్షల్లో ఆస్తి నష్టం
దిశ, కాల్వ శ్రీరాంపూర్: మంగళ వాయిద్యాలు, బంధుమిత్రుల రాకతో కళకళలాడాల్సిన ఓ పెళ్లింట్లో అగ్ని ప్రమాదం సంభవించిన ఘటన మండల పరిధిలోని వెన్నంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం కాసాని ఐలయ్య ఓ పూరి గుడిసెలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. 18న తన కూతురి వివాహాన్ని ఘనంగా జరిపించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే ఐలయ్య ఇంటి సమీపంలో ఉన్న రైతు అప్పని రాజయ్య తన వ్యవసాయ క్షేత్రంలో పత్తి పొరకను తగులబెడుతుండగా ప్రమాదవశాత్తూ నిప్పురవ్వలు ఎగసి ఐలయ్య గుడిసెపై పడ్డాయి.
అసలే వేసవి తాపం ఎక్కువగా ఉండటంతో మంటలు ఎక్కసారిగా ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.20లక్షల అస్తి నష్టం సంభవించిందని గ్రామస్థులు తెలిపారు. పెళ్లి కోసం ఇంట్లో తెచ్చిపెట్టిన 15తులాల బంగారం, రెండు బెడ్లు, ఎల్ఈడీ టీవీ, రిఫ్రిజిరేటర్ పూర్తిగా దగ్ధమయ్యాయి. కొద్దిరోజుల క్రితం ఐలయ్య తన పొలంలో పండిన పత్తి అమ్మగా వచ్చిన డబ్బు, నిత్యవసర వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయని స్థానికులు తెలిపారు. సకాలంలో ఫైరింజన్ రాకపోవడంతో నష్టం మరింత సంభవించిందని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు, అధికార యంత్రాంగం ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
- Tags
- fire accident