- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
దిశ, కరీంనగర్ టౌన్: అకాల వర్షాలు, వడగండ్లతో పంట నష్టపోయిన రైతాంగాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకోవడానికి వెంటనే చర్యలు చేపట్టాలని, పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. పంట నష్టపోయిన రైతులను ఎకరాకు పదివేల నష్ట పరిహారం చెల్లించి ఆదుకుంటామని సీఎం కెసిఆర్ స్వయంగా ప్రకటన చేసినా.. నేటికీ కార్యరూపం దాల్చలేదని తీవ్రంగా విమర్శించారు.
మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలతో రైతుల జీవితాలతో ప్రభుత్వం చేలగాటం ఆడుతోందని ఆయన మండిపడ్డారు. పంట నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి తొమ్మిదేళ్లుగా ఆలోచన చేయడం లేదన్నారు. కనీసం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చినా ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రావని, అలాంటప్పుడు కేంద్ర ప్రభుత్వం నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవడానికి అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజన పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా రైతులను అరిగోస పెట్టడం విచారకరమన్నారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షాలకు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని భయాందోళనలో తీవ్ర ఆందోళనలో అన్నదాతలు ఉన్నారని తెలిపారు. వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించే విధంగా తగిన చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.