అధికారులకు రైతుల వార్నింగ్.. సర్వేకు వస్తే బడితపట్టి జోపుడే అంటూ..

by Dishadaily Web Desk |
అధికారులకు రైతుల వార్నింగ్.. సర్వేకు వస్తే బడితపట్టి జోపుడే అంటూ..
X

దిశ ప్రతినిధి, కరీంనగర్, రామడుగు: ఎప్పుడు అధికారులు ఎంట్రీ ఇస్తారో తెలియడం లేదు. మూడో టీఎంసీ పనులు చేపట్టి తీరాల్సిందేనని అధికార యంత్రాంగం పట్టుబడుతోంది. భూ సేకరణ సర్వే కోసం తరుచూ అధికారులు వస్తుండడం, వారిని నిలువరించడం, పోలీసులు రంగ ప్రవేశం చేస్తుండడంతో ఆ రైతులు కాస్త డిఫరెంట్‌గా ఆలోచించారు. తమ పంట పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామానికి చెందిన రైతులు కొంతమంది ఈ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

"తమ భూముల్లోకి అనుమతి లేకుండా సర్వే చేసేందుకు అధికారులు కానీ సర్వేయర్లు కానీ వచ్చినట్టయితే కేసీఆర్ దొర చెప్పినట్టు బడితే పట్టి జోపుడు కార్యక్రమం జరుపబడును" అని ముద్రించిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఉన్న కొద్దిపాటి భూమిని మూడో టీఎంసీ పనుల కోసం అప్పగిస్తే తాము బ్రతకడం ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. పరిహారం కూడా బొటాబొటిగా ఇస్తామంటున్నారు. దీంతో తమ కుటుంబాలను పోషించడం కష్టమవుతుందని అంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న మూడో టీఎంసీ పనులను నిలిపివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story