- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నకిలీ విత్తనాలు అమ్మేవారి పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలి : ఎస్పీ అఖిల్ మహాజన్
దిశ, కోనరావుపేట : నకిలీ విత్తనాలు అమ్మేవారి పట్ల రైతులు జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం పోలీసు శాఖ, వ్యవసాయ శాఖ అధికారులతో కలసి జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యల మీద సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల్ మహాజన్ మాట్లాడుతూ.. వానాకాలం సాగు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అన్నదాతలు నకిలీ విత్తనాల భారీన పడకుండా ముందస్తు చర్యలకు జిల్లా పోలీసులు సిద్ధంగా ఉండాలన్నారు.
నకిలీ విత్తనాల సరఫరా, ఉత్పత్తి, అమ్మకాలు అరికట్టేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయిలో ప్రత్యేక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ అధికారులతో కలసి ఎప్పటికప్పుడు తనిఖీలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తామన్నారు. జిల్లా పరిధిలో ఎవరైనా వ్యాపారస్థులు, సంస్థలు, వ్యక్తులు నకిలీ విత్తనాలను విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందితే తక్షణమే స్పెషల్ బ్రాంచ్ సీఐ కరుణాకర్ 87126 56411 నెంబర్ కు లేదా డయల్ 100, స్థానిక పోలీసులకు సమాచారం అందజేయాలని కోరారు.
సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచడంతో పాటు, కీలక సమచారం ఇచ్చిన వ్యక్తులకు పారితోషికాలు అందిస్తామని ఎస్పీ తెలిపారు. గతంలో నకిలీ విత్తనాల కేసుల్లో సంబంధం ఉన్న వారిపై కూడా నిఘా ఉంచాలన్నారు. మళ్లీ వాళ్లు ఆదే తరహాలో అమ్మినా, జిల్లాలో ఎవరైనా నకిలీ విత్తనాలు సరఫరా చేసినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా రైతులు విత్తనాలను వ్యవసాయ శాఖ నిర్దేశించిన దుకాణాల్లో మాత్రమే ఖరీదు చేయడం మంచిదన్నారు. నకిలీ విత్తనాలు, పురుగుల మందులు అమ్మే వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ కోరారు.
అనంతరం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ మాట్లాడుతూ..రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోకుండా విత్తనాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాన్నారు. ఒకటికి.. రెండు సార్లు సరి చూసుకుని కంపెనీ ధృవీకరించబడిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలన్నారు. పత్తి సాగు చేయాలనుకునే రైతులు సర్టిఫైడ్ కంపెనీ సీడ్ ఆర్గనైజర్ వద్దే విత్తనాలు తీసుకోవాలన్నారు. వాటిని రైతులు కొనుగోలు చేసినప్పుడు ఆర్గనైజర్ నుంచి రశీదు పొందాలన్నారు. అలాగే తీసుకున్న ప్యాకెట్ కవర్స్ ను పంట పూర్తి అయ్యే వరకు రైతులు తమ వద్దే దాచాలన్నారు.
ఆయా విత్తనాలను సాగు చేయడం వల్ల రైతు నష్టాలు పొందినట్లైతే సంబంధిత ఆర్గనైజర్ ను, కంపెనీని, బాధ్యులను చేయుటకు రైతు తీసుకున్న రశీదు, ప్యాకెట్ కవర్లు ఒక ఆధారంగా ఉపయోగపడుతాయని, ఆ ఆర్గనైజర్, కంపెనీ పై కఠిన చర్యలు తీసుకొనుటకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్య గారు, డీఎస్పీ లు విశ్వప్రసాద్, నాగేంద్రచారి, రవికుమార్, సీఐలు ఎస్.ఐలు మండల స్థాయి వ్యవసాయ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.