రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలి: మంత్రి గంగుల కమలాకర్

by Shiva |
రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలి: మంత్రి గంగుల కమలాకర్
X

దిశ, కరీంనగర్ టౌన్: రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలంటూ గంగుల కమలాకర్ ఆకాంక్షించారు. మంగళవారం తెలంగాణ చౌక్ లో నిర్వహించిన హోళీ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హళీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం గంగుల కార్యకర్తలతో కలిసి డీజే పాటలకు స్టెప్పులేశారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. తెలంగాణలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆనందంగా జరుపుకునే పండుగ హోళీ ఆయన అన్నారు. విభేదాలను, రాజకీయాలను పక్కన పెట్టి ఆడుకునే పండుగ రంగుల కేళి హోళీ అని తెలిపారు. నాడు కార్యకర్తగా, నిన్న ఎమ్మెల్యేగా ఎలా ఉన్నానో.. నేడు మంత్రిగా అలానే ఉన్నానని, ఎలాంటి భేషజాలకు తావు లేకుండా అందరితో కలిసి హోళీ ఆడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం అమలు అవుతున్న సంక్షేమ పథకాలు ఈ విధంగానే కొనసాగాలంటే మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని కోరారు. హోళీ పండుగ వేళ రసాయనిక రంగులు కాకుండా సహజమైన రంగులతో పండుగ జరుపుకోవాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed