- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేటీఆర్ కు ఇథనాల్ బాధితుల నిరసన సెగ
దిశ, వెల్గటూర్ : వెల్గటూర్ మండల కేంద్రంలో సోమవారం రోడ్ షోను ముగించుకొని హెలిప్యాడ్ వద్దకు తిరిగి వెళ్తున్న మంత్రి కేటీఆర్ కు పాషిగాం రైతుల నిరసన సెగ తగిలింది. మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మన్ కుమార్ కంటె ధర్మపురి నియోజక వర్గంలో ప్రధానంగా వెల్గటూర్, ధర్మారం మండలాల్లో వెనుకబడి ఉన్నాడనే టాక్ బాగా వినిపించటంతో బీఆర్ఎస్ మైలేజి పెంచటానికి కేటీఆర్ రోడ్ షో ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఓ సారి ధర్మపురి నియోజక వర్గంలో కేటీఆర్ బహిరంగ సభ జరిగింది. అయినా మరోసారి కేటీఆర్ రోడ్డుషోను వెల్గటూర్ లో ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలోనే శనివారం రోజున హెలికాప్టర్ ద్వారా కేటీఆర్ వెల్గటూర్ విచ్చేసి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు. హెలికాప్టర్ కోసం హెలిపాడ్ ను ఇథనాల్ ప్రాజెక్టు నిర్మించే పాషిగాం గ్రామ సమీపంలోనే ఏర్పాటు చేశారు.
రోడ్ షోను ముగించుకొని తిరిగి హెలిపాడ్ వద్దకు తిరిగి వెళ్తున్న కేటీఆర్ కాన్వాయ్ కి పాషిగాం ఇథనాల్ బాధిత రైతులు ప్ల కార్డులతో నిరసన వ్యక్తం చేశారు. కాళేశ్వరం లింక్ టు ప్రాజెక్టు వల్ల ఎవరికి లాభం ప్రభుత్వానికా, మంత్రికా, మీ ఫాం హౌస్ లకా, మంత్రి కొప్పుల ఈశ్వర్ కా, కట్టింగ్ లేకుండా వడ్లుకొనే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. గో బ్యాక్ కేటీఆర్ అంటూ మంత్రి కేటీఆర్ వెళ్తుండగా బాధిత రైతులు ఫ్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తమై రైతులను అడ్డుకున్నారు. అనంతరం కేటీఆర్ కాన్వాయి హెలిపాడ్ వద్దకు వెళ్లింది. ఇప్పటికే ఇథనాల్ ప్రాజెక్టును రద్దు చేశామని మంత్రి కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ చెప్తున్నా స్తంభం పల్లి, పాషిగాం గ్రామాల రైతులు నమ్మటం లేదు. నోటిమాటల ద్వారా రద్దయిందని చెప్పటం కంటే అధికారికంగా లెటర్ విడుదల చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు. పోలీసులు ఎంతగా తమ పై ఒత్తిడి చేసిన అప్పటిదాక తమపోరాటం ఆగదని వారు హెచ్చరించారు.