జమ్మికుంటలో ఆక్రమణలు.. రెచ్చిపోతున్న కబ్జాదారులు..

by Sumithra |   ( Updated:2024-11-19 06:25:37.0  )
జమ్మికుంటలో ఆక్రమణలు.. రెచ్చిపోతున్న కబ్జాదారులు..
X

అధికారుల, నాయకుల అండదండలతో భూ కబ్జాదారులు పెట్రేగిపోతున్నారు. జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. భూముల విలువ పెరగడంతో ప్రభుత్వ భూమి కనబడితే ఆక్రమించేందుకు కబ్జాదారులు ప్రయత్నాలు చేసి దక్కించుకుంటున్నారు. జమ్మికుంట పట్టణంలోని జమ్మికుంట హుజూరాబాద్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న శ్మశానవాటిక దారిని కబ్జా చేసి భూ కబ్జాదారులు ఇల్లు నిర్మించారు. సామాన్యులు ఇంటి నిర్మాణానికి పర్మిషన్‌ కోసం చెప్పులు అరిగేలా మున్సిపల్ చుట్టూ తిరిగినా పర్మిషన్ రావట్లేదు. అటువంటిది శ్మశానవాటిక దారిని కబ్జా చేసి ఇల్లు కట్టినా అధికారులు స్పందించకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో అక్కడ శ్మశాన వాటికకు దారి, ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పాతినా ఆ బోర్డు తీసేసి ఇల్లు నిర్మించడం గమనార్హం. ఈ విషయం పై ప్రజలు, అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని శ్మశానవాటిక దారిని కాపాడాలని కోరుతున్నారు.

దిశ, జమ్మికుంటటౌన్ : అధికారుల, నాయకుల అండదండలతో భూ కబ్జాదారులు పెట్రేగిపోతున్నారు. జమ్మికుంట పట్టణంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. భూముల విలువ పెరగడంతో ప్రభుత్వ భూమి కనబడితే చాలు ఎలాగైనా ఆక్రమించేందుకు కబ్జాదారులు ప్రయత్నాలు చేసి దక్కించుకుంటున్నారు.

శ్మశానవాటిక దారి కబ్జా..

జమ్మికుంట పట్టణంలోని జమ్మికుంట హుజూరాబాద్ ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న శ్మశానవాటిక దారిని కబ్జా చేసి భూ కబ్జాదారులు ఇల్లు నిర్మించారు. సామాన్యులు ఇంటి నిర్మాణానికి పర్మిషన్‌ కోసం చెప్పులు అరిగేలా మున్సిపల్ చుట్టూ తిరిగినా పర్మిషన్ రావట్లేదు. కానీ శ్మశానవాటిక దారిని కబ్జా చేసి ఇల్లు కట్టినా అధికారులు స్పందించడం లేదు. గతంలో ఆ దారిలో శ్మశానవాటికకు దారి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డు పాతినా ఆ బోర్డు తీసేసి ఇల్లు నిర్మించడం గమనార్హం. ఈ విషయం పై ప్రజలు, అధికారులు తక్షణమే చర్యలు తీసుకుని శ్మశానవాటిక దారిని కాపాడాలని కోరుతున్నారు.

పెసర బండ సైతం కబ్జా..

జమ్మికుంటకు ముందు పెసర బండ అని పేరు ఉండేది. ఈ పెసర బండ పై జమ్మికుంట చుట్టుపక్కల ఉన్న గ్రామాలు వ్యాపారం నిర్వహించేవారు. అంతటి పేరున్న పెసర బండను కబ్జా చేసి చుట్టూ ప్రహరీ నిర్మించి భూ కబ్జాదారులు ఇల్లు కడుతున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా, ఈ భూమి పై మరో సర్వే నంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ముందు తరాలకు చెప్పుకోవడానికి పెసరు బండ ఉండాలని జమ్మికుంటకు మారుపేరైన పెసరు బండను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రభుత్వ సీసీ రోడ్డు కబ్జా..

జమ్మికుంట పట్టణంలోని బస్టాండ్ సమీపంలో సీసీ రోడ్డుకు రెండు వైపులా గోడ నిర్మించి రోడ్డును కబ్జా చేయడం గమనార్హం. ప్రభుత్వం సీసీ రోడ్డును నిర్మించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రవాణా సౌకర్యం కల్పిస్తే కబ్జాదారులు ఆ సీసీ రోడ్డుకు ఇరువైపులా గోడ నిర్మించి రోడ్డును ఇంట్లో కలుపుకుని వాడుకుంటున్నారు. ఈ విషయం పై మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం పై పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ భూములను కాపాడాలి..

జమ్మికుంట పట్టణంలోని కాంగ్రెస్ నాయకులు జమ్మికుంట మున్సిపల్ కమిషనర్‌కు ప్రభుత్వం సర్వేనంబర్లలో ప్రభుత్వ భూములు కబ్జా చేసి ప్లాట్లుగా నిర్మించారు. ఇండ్లను సైతం కట్టుకొని ఇంటి నంబర్లు, మీటర్లు తెచ్చుకొని భూ కబ్జా చేయడం పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం అందించి నెల రోజులు గడుస్తున్నా చర్యలు తీసుకోకపోవడం పై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులే చోద్యం చూడడం పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed