ధాన్యం కొనుగోలు కేంద్రానికి పొంచి ఉన్న విద్యుత్ ముప్పు..

by Sumithra |
ధాన్యం కొనుగోలు కేంద్రానికి పొంచి ఉన్న విద్యుత్ ముప్పు..
X

దిశ, ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిష్టం పల్లి సింగిల్ విండో కేంద్రం వద్ద కరెంట్ తీగలు అత్యంత ప్రమాదకరంగా మారాయి. ఆదివారం ఉదయం ఓ లారీ నిండా ధాన్యం తీసుకెళ్తుండగా విద్యుత్ తీగలు తగిలి అంటుకునే ప్రమాదం జరిగే అవకాశం ఉండగా నిర్వాహకులు అప్రమత్తమై చేతి కర్రతో విద్యుత్ తీగలను పైకి లేపడంతో ప్రమాదం తప్పింది. ప్రతిరోజూ ఇక్కడి సింగిల్ విండో కేంద్రం నుండి ప్రతిపంటకు సుమారు 50 లారీల వరకు కేటాయించిన రైస్ మిల్లులకు వడ్లను లారీల ద్వారా వేలాది క్వింటాల్ ల వడ్లను రైస్ మిల్లులకు కేటాయించగా ధాన్యం లారీల్లో తీసుకెళ్తున్నారు.

లారీల్లో పుల్ లోడుతో వెళుతుండగా విద్యుత్ వైర్లు తాకుతూ వెళ్ళే పరిస్థితి ఉండగా సెంటర్ నిర్వాహకులు చేతి కర్రతో విద్యుత్ వైర్లు లారీలకు తాకే పరిస్థితి ఉండగా వాటిని పైకి లేపి లారీలకు ఎలాంటి విద్యుత్ ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రమాదకర స్థితిలో విద్యుత్ వైర్లు ఉన్నాయని సింగిల్ విండో పాలకవర్గానికి చెప్పినా పట్టించుకోవడం లేదని, సెస్ అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన గత నాలుగు సంవత్సరాలుగా ఉన్న విద్యుత్ తీగలను సరి చేయడం లేదని వడ్ల లారీలకు ఏదైనా విద్యుత్ ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఎవరు చెల్లిస్తారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సెస్ అధికారులు స్పందించి వడ్ల లారీలకు పొంచి ఉన్న ప్రమాదం సరి చేయాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Next Story