- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దేశంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా : రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్
దిశ, కోనరావుపేట : నిత్య కోతల నుంచి నిరంతరం వెలుగులు అందిస్తూ.. రాష్ట్రంలో విద్యుత్ ప్రగతి ప్రస్థానం విజయవంతంగా కొనసాగుతోందని, దేశంలోనే రికార్డు స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా జరుగుతోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పద్మ నాయకా ఫంక్షన్ హాల్లో జరిగిన రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యుత్ ప్రగతి ఉత్సహాలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయం సహా అన్ని రంగాలకు 24 గంటల పాటు నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్ ను సరఫరా చేస్తున్నామని, ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన ఘనత అని పేర్కొన్నారు. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ రంగం నిర్లక్ష్యానికి గురైందని, అయితే తెలంగాణ స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత అనేక కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నిర్మించి ఎంతో పురోగతి సాధించామని, ప్రస్తుతం మిగులు విద్యుత్ రాష్ట్రం దిశగా అడుగులు వేస్తున్నామని వినోద్ కుమార్ తెలిపారు.
కొత్తగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, సబ్ స్టేషన్లు, కొత్త లైన్లు నిర్మించడం వల్ల రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 2,140 యూనిట్లకు చేరిందని, ఇది జాతీయ సగటు 1,255 కంటే 70% అధికమని వినోద్ కుమార్ వివరించారు. సోలార్ పవర్ జనరేషన్ లో దేశంలోని అగ్రగామి రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటి అని వినోద్ కుమార్ తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం 74 మెగావాట్ల సోలార్ విద్యుత్ కెపాసిటీ ఉండగా, తెలంగాణ ఆవిర్భావం తర్వాత సోలార్ కెపాసిటీ 6,274 మెగా వాట్లకు పెరిగిందని ఆయన తెలిపారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 8.46 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని, 27.49 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీ వ్యవస్థలను విస్తరించడానికి, పటిష్టం చేయడానికి రూ. 97, 321 కోట్లు వెచ్చించినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గృహ వ్యవసాయ రంగాల సబ్సిడీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.11,500 కోట్ల విడుదల చేసిందని, విద్యుత్ సరఫరా, ఉత్పత్తి కోసం రూ.39,321 కోట్లు ఇన్వెస్ట్ మెంట్ చేసిందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం, పాలమూరు రంగారెడ్డి వంటి బహుళార్ధ ఎత్తిపోతల పథకాల ప్రాజెక్టుల విద్యుత్ డిమాండ్ మేరకు 6,435 మెగాపట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థను నిర్మించారు. అదేవిధంగా నిర్మాణంలో ఉన్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన డిమాండ్ కోసం 6,454 మెగావాట్ల విద్యుత్ సరఫరా వ్యవస్థల నిర్మాణాలు జరుగుతున్నాయని వెల్లడించారు. భవిష్యత్తులో అవసరమైన 820 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆయన తెలిపారు.
టేస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ.. తెలంగాణ విద్యుత్ ప్రగతి - నిత్య కోతల నుండి నిరంతర వెలుగులకు ప్రస్థానం చేరిందన్నారు. జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం కరెంట్ కోతల నుండి నిరంతర వెలుగులు విరజిమ్ముతుందనడములో అతిశయోక్తి లేదన్నారు. నాడు సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతల వలన ప్రజలు ఇబ్బంది పడుతుండేవారని గుర్తుచేశారు. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ.. పవర్ లూమ్ తో సహా రాష్ట్రంలో లేని విధంగా అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరాను రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత్ విద్యుత్ ను అందిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు.
ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు మాట్లాడుతూ.. 52 ఏళ్ల చరిత్ర కలిగిన సెస్ సహకార సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నదని భవిష్యత్తు సవాళ్లకు దీటైన జవాబు సహకార సంఘాల ద్వారానే సాధ్యమని అన్నారు. ఒకప్పుడు సిరిసిల్ల తాలుకాలో మర మగ్గాలు నడవాలన్న కరెంట్ బోర్లు నడవాలన్న పిండి గిర్ని నడవాలన్నా సెస్ అవసరం. ఇప్పుడు పవర్ లూం ఉన్నాయంటే అనాడు సెస్ ఉండడం వల్లనే ఇక్కడ ఇంకా పవర్ లూం లు నడుతున్నాయన్నారు. వేములవాడ లో 24 గంటల కరెంట్ 40 ఏళ్ల నుంచి ఇస్తున్నామంటే సెస్ సంస్థనే కారణమన్నారు.
ఈ ప్రాంతంలో విద్యుత్ అంటేనే సెస్ అని నేను కథలాపూర్, మేడిపల్లి మండలాలకు వెళ్ళినప్పుడల్లా సెస్ యొక్క ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అకునూరి శంకరయ్య, వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి, జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ వైస్ చైర్మన్ తిరుపతి, సెస్ డైరెక్టర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.