- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘కుల వివక్షత నిర్మూలన కోసం కృషి చేయాలి’
దిశ, చిగురుమామిడి : కుల వివక్షత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తహసిల్దార్ సయ్యద్ ముబీన్ అహ్మద్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలోని అంబేద్కర్ భవనంలో మంగళవారం సివిల్ రైట్స్ డే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా అధికారులు, ప్రజా ప్రతినిధులు గ్రామంలో దళితులు ఎదుర్కొంటున్న పలు ఇబ్బందులపై చర్చించారు. దళిత కాలనీలో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.
సమస్యలు పరిష్కరించాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, ఎంపీడీఓ మామిడిపల్లి నర్సయ్య, ఎస్సై దాస సుధాకర్, వ్యవసాయ అధికారి కేతిరి రంజిత్ రెడ్డి, రెవిన్యూ ఇన్స్పెక్టర్ పూదరి రాజు గౌడ్, తెలంగాణ అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షుడు మాసం సది కుమార్, పంచాయతీ కార్యదర్శి గడ్డం వెంకట రమణ, వార్డు సభ్యులు మ్యాకల సంపత్ కుమార్, బొలమల్ల సావిత్రి, కారోబార్ గొల్లపల్లి సత్యనారాయణ చారి, దళిత సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.